సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీ లాగిన ఆకతాయి.. బైక్‌ కింద పడి దుర్మరణం.. 

ఇటీవల ఆకతాయిలా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇష్టానూసారంగా వ్యవహరిస్తోన్నారు. కొన్ని సార్లు వారు చేసే పనులు ఇతరుల ప్రాణాల మీదికి వస్తోంటే. ఇంకొన్నిసార్లు వారు చేస్తున్న నిర్లక్ష్యమైన పనులు వారి ప్రాణాలు మీదికే తెస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆకతాయిలు చేసిన పనికి ఓ విద్యార్థిని బలైంది.

Google News Follow Us

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్‌లో శుక్రవారం హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. 12వ తరగతి విద్యార్థిని సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా.. బైక్‌పై వెళ్తున్న ఓ అగంతకులు ఆమె కండువా లాగారు. దీంతో విద్యార్థిని బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోయింది. వెనుక నుంచి వేగంగా వస్తున్న బైక్‌ ఆమెను ఢీకొట్టడంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ఈ షాకింగ్ కేసు అంబేద్కర్ నగర్‌లోని హన్స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. హన్స్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హి ఐదిల్‌పూర్‌లో నివాసం ఉంటున్న 17 ఏండ్ల నైన్సీ పటేల్. హీరాపూర్ బజార్‌లోని రాంరాజీ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నది.  ఆమె ఎప్పటిలాగానే కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కొంత మంది ఆకతాయిలు ఆ యువతిని బైక్ పై వెంబడించారు.  ఆ బాలికను ఆటపట్టిస్తూ.. వేధించ సాగారు. సరిగ్గా హీరాపూర్ మార్కెట్‌ సమీపంలోకి చేరుకోగా.. ఇద్దరూ ఆకతాయిలు ఓ బైక్ వచ్చారు.

బైక్ మీద వెనుకలా కూర్చున్న ఓ పోకిరీ ఆ బాలిక చున్నీ లాగారు. దీంతో బాలిక సైకిల్‌పై బ్యాలెన్స్‌ తప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ క్రమంలో అటుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో పుటేజ్ వైరలవుతోంది. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి  విద్యార్థిని స్కార్ఫ్‌ను లాగిన ఘటన సీసీటీవీలో బయటపడింది. 

ఈ ఘటనపై విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో తన కుమార్తె తీవ్రంగా గాయపడిందనీ, హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందని తెలిపారు. షాబాజ్, అర్బాజ్, ఫైజల్ అనే ముగ్గురు పోకిరీలు తన కూతురిని రెండు మూడు రోజులుగా వేధిస్తున్నారని బాధితురాలి తండ్రి వాపోయారు. శుక్రవారం నాడు ఆ వ్యక్తులే తన కూతురి దుపట్టా లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాబాజ్, అర్బాజ్, ఫైజల్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు.