Delhi High Court: 'విడాకులు తీసుకున్న కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు లేదు'   

Published : Sep 17, 2023, 12:59 AM IST
Delhi High Court: 'విడాకులు తీసుకున్న కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు లేదు'   

సారాంశం

Delhi High Court: విడాకులు తీసుకున్న కుమార్తెకు మరణించిన తన తండ్రి సంపదపై హక్కులు ఉండవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం అవివాహిత, భర్త మరణించి వితంతుగానే ఉన్న కుమార్తెలకు మాత్రమే మరణించిన తండ్రి ఆస్తిలో హక్కు ఉన్నదని కోర్టు తీర్పు చెప్పింది. 

Delhi High Court: విడాకులు తీసుకున్న ఓ మహిళ తన తల్లి, సోదరుడి నుంచి భరణం కోరుతూ చేసిన దావాను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం పెళ్లికాని లేదా వితంతువు అయిన కుమార్తెకు మాత్రమే తండ్రి ఆస్తిపై హక్కు ఉందని, అయితే విడాకులు తీసుకున్న కుమార్తెకు భరణం పొందే అర్హత లేదని కోర్టు పేర్కొంది.  హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ (HAMA) ప్రకారం.. విడాకులు తీసుకున్న కూతురు లేదని కోర్టు స్పష్టం చేసింది.

విడాకులు తీసుకున్న మహిళ పిటిషన్‌ను  న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైట్, నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. మరణించిన వారి ఆస్తిలో అవివాహిత లేదా వితంతువు కుమార్తెకు హక్కు ఉందని, కానీ.. విడాకులు పొందిన కుమార్తె భరణం పొందేందుకు అర్హులు. కానీ.. తన తల్లి , సోదరుడి నుండి భరణం పొందే హక్కులేదని కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను మహిళ సవాలు చేసింది.

తాను విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాననీ, మరణించిన తన తండ్రి సంపద నుంచి తనకు నెలనెలా జీవన భృతి ఇప్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన పిటిషన్‌లో ప్రతివాదులుగా తల్లిని, సోదరుడిని చేర్చింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తాజా తీర్పు వెల్లడించింది. 

 అసలేం జరిగిందంటే..? 

ఓ మహిళ తండ్రి 1999లో చనిపోయాడు. చట్టబద్ధమైన వారసురాలిగా తనకు ఎలాంటి వాటా ఇవ్వలేదన్నది  మహిళ కేసు. ఆస్తిలో వాటా కోసం ఒత్తిడి చేయబోమని హామీ ఇవ్వడంతో నెలకు రూ.45 వేలు భరణంగా ఇచ్చేందుకు తల్లి, సోదరుడు అంగీకరించారని మహిళ వాదించింది. ఇలా నవంబర్ 2014 వరకు సక్రమంగా మెయింటెనెన్స్ చెల్లించారని, అయితే ఆ తర్వాత చెల్లించేందుకు వారు నిరాకరించారని మహిళ చెప్పింది.

తన భర్త తనను విడిచిపెట్టాడని, సెప్టెంబర్ 2001లో విడాకులు తీసుకున్నాడని మహిళ చెప్పింది. తన భర్త జాడ తెలియడం లేదని, అందుకే అతడి నుంచి ఎలాంటి భరణం లేదా భరణం అడగలేదని ఆ మహిళ తెలిపింది. అయితే.. మహిళ వాదనను తోసిపుచ్చిన కోర్టు.. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ.. ఆమె HAMA చట్టం పరిధిలోకి రాదనీ, అందువల్ల ఆమె తన తల్లి, సోదరుడి నుండి భరణం క్లెయిమ్ చేసే అర్హత లేదని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్