Assembly Election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ను ప్రకటించనున్న ఈసీ..

By Sumanth KanukulaFirst Published Jan 8, 2022, 12:51 PM IST
Highlights

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ.. మరికొద్ది నెల్లలో శాసనసభ పదవీకాలం పూర్తి అవుతున్న ఐదు రాష్ట్రాల్లో  ఎన్నికలు (Assembly Election 2022) నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) సిద్దమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల  షెడ్యూల్‌ను ఈసీ ఈ రోజు (జనవరి 8) ప్రకటించనుంది. 

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ.. మరికొద్ది నెల్లలో శాసనసభ పదవీకాలం పూర్తి అవుతున్న ఐదు రాష్ట్రాల్లో  ఎన్నికలు (Assembly Election 2022) నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) సిద్దమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల  షెడ్యూల్‌ను ఈసీ ఈ రోజు (జనవరి 8) ప్రకటించనుంది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుందని.. ఇందులో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించనుంది.

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో..  ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చి నెలలో వివిధ తేదీల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు సిద్దమైంది. ఇక, యూపీలో మొత్తం 403, ఉత్తరాఖండ్‌లో మొత్తం 70, పంజాబ్‌లో మొత్తం 117, గోవాలో మొత్తం 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అయితే గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు.. ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా ప్రధాని మోదీని, ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ మాత్రం.. ఎన్నికలను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు.. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే ప్రధాన ఎన్నిక కమిషనర్ సుశీల్ చంద్ర ఇటీవల మాట్లాడుతూ.. ఎన్నికలు వాయిదా వేయవద్దని పార్టీలు కోరాయని.. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. 

ఇక, దేశంలో కరోనా కేసుల ఉధృతిని కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలోనే ఈసీ.. ఎన్నికల ప్రచారం, నిర్వహణ, కౌంటింగ్ సమయాల్లో తీసుకొవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్ టాస్క్‌ఫోర్స్, కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇప్పటికే పలు సూచనలను స్వీకరించింది. 
 

click me!