Coronavirus Effect: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు వైరస్ కట్డడి చర్యలకు ఉపక్రమించాయి. దేశంలోని చాలా రాష్ట్రాలకు స్కూళ్లను మూసివేస్తున్నాయి.
Coronavirus Effect: కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. చాలా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడుతోంది. దీంతో Coronavirus కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. భారత్ లోనూ కరోనా విజృంభణ మొదలైంది. గత 24 గంటల్లో ఏకంగా దాదాపు లక్షన్నర కొత్త కేసులు నమోదుకావడం Coronavirus వ్యాప్తికి అద్దం పడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ సైతం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నామని నిపుణులు పేర్కొంటూ.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలను వేగవంతం చేస్తున్నాయి. దీనిలో భాగంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తూ.. పాఠశాలలు మూసివేస్తున్నాయి. పిల్లల టీకా కార్యక్రమాన్ని సైతం ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్నందున, అనేక రాష్ట్రాలు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించాయి. బీహార్‌లోని పాఠశాలలు, విద్యాసంస్థలు జనవరి 21 వరకు మూసివేయబడతాయి. అసోంలో జనవరి 30 వరకు పాఠశాలలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఫిబ్రవరి 1 వరకు పాఠశాలలు, కళాశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని సీఏం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా సర్కారు పేర్కొంది. ఇదిలావుండగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మరియు కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) టర్మ్-1 ఫలితాలను జనవరి చివరి నాటికి ప్రకటించాలని నిర్ణయించాయి.
undefined
"కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో భౌతిక తరగతులను నిలిపివేసింది. ఆయా విద్యాసంస్థల్లో అన్ని తరగతులు, పరీక్షలు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి" అని మహారాష్ట్ర ఉన్నత-సాంకేతిక విద్యా మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. జార్ఖండ్ లోనూ Coronavirus నేపథ్యంలో విద్యాసంస్థలు మూత పడ్డాయి. జార్ఖండ్‌లోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సంస్థలు సహా ఇతర విద్యా సంస్థలు జనవరి 15 వరకు మూసివేయబడతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈశాన్య భారతంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అసోం సర్కారు సైతం పాఠశాలలు మూసివేయడానికి నిర్ణయం తీసుకుంది. 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ జనవరి 30 వరకు పాఠశాలలు మూసివేయబడతాయనీ, నైట్ కర్ఫ్యూ సమయాలు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు ఉంటాయని అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ చెప్పారు.
మహారాష్ట్రలోCoronavirus ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఔరంగాబాద్, నాసిక్, పూణే, ముంబయి సహా అనేక నగరాల్లోని పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లోనూ కరోనా కొత్త కేసులు క్రమంగా అధికం అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం 1 నుండి 12 తరగతుల విద్యార్థుల భౌతిక తరగతులను తాత్కాలికంగా నిలిపివేయాలని యూపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. Coronavirus కారణంగా మిజోరంలోనూ 1 నుంచి 9 తరగతులు పాఠశాలలను మూసి వేశారు. అయితే, ఈ సంవత్సరం బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10, 12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు, హాస్టళ్లు తెరిచి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. Coronavirus కట్టడి చర్యల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం జనవరి 31 వరకు 1 నుండి 9 తరగతుల విద్యార్థులకు భౌతిక తరగతులను నిలిపివేసింది. ఆన్‌లైన్ విద్యను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. బీహార్ లోనూ పాఠశాలలు, విద్యా సంస్థలు జనవరి 21 వరకు మూసివేయబడతాయని ప్రభుత్వం పేర్కొంది.