సాయంత్రంలోగా స్పీకర్‌ను కలవాలి: కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలకు సుప్రీం ఆదేశం

By narsimha lodeFirst Published Jul 11, 2019, 1:02 PM IST
Highlights

కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం ఆరు గంటల్లోపుగా స్పీకర్‌ రమేష్‌కుమార్ ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు న్యాయస్థానం ఆదేశించింది. 

బెంగుళూరు: కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం ఆరు గంటల్లోపుగా స్పీకర్‌ రమేష్‌కుమార్ ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు న్యాయస్థానం ఆదేశించింది. 

 కర్ణాటక రెబెల్స్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన  పిటిషన్‌‌ను  గురువారం నాడు సుప్రీంకోర్టు  విచారించింది.  రెబెల్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అసంతృప్త ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరై తమ రాజీనామాల విషయాన్ని చర్చించాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై రేపటిలోపుగా నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రెబెల్ ఎమ్మెల్యేలు బెంగుళూరుకు చేరుకొనేందుకు తగిన భద్రతను కల్పించాలని కర్ణాటక డీజీపీకి సూచించింది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
 

click me!