రూ.10కోట్లు ఆస్తి ఉన్న వధువు కావలెను

Published : Jul 11, 2019, 12:24 PM IST
రూ.10కోట్లు ఆస్తి ఉన్న వధువు కావలెను

సారాంశం

పెళ్లి కావాల్సిన యువతీ, యువకులు తమకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో తెలియజేస్తూ... పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూసే ఉంటారు. 

పెళ్లి కావాల్సిన యువతీ, యువకులు తమకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో తెలియజేస్తూ... పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూసే ఉంటారు. వధువు కావలెను, వరుడు కావలెను పేరిట ఈ వివరాలు పేపర్లలో యాడ్ రూపంలో కనిపిస్తాయి. ఆ ప్రకటనలో తమ వివరాలు చెబుతూ.. తాము ఎలాంటి అర్హతలు ఉన్నవారు కావాలని అనుకుంటున్నామో తెలియజేస్తారు. 

దాదాపు అందరూ రంగు, చదువు, ఉద్యోగం, కులం లాంటి వాటిని ప్రధానంగా అందులో చెబుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు రూ.10కోట్లు ఆస్తి ఉన్న యువతి వధువుగా కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చాలా విచిత్రంగా ఉండటంతో.. నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది.

పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. వధువుకు రూ.10 కోట్ల ఆస్తి ఉండాలంటూ షరతు పెట్టి వార్తల్లో నిలిచాడు. సిలిగుడిలోని కాలియాగంజ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు (42) తనపేరు చెప్పకుండా, అమ్మాయి పేరుమీద రూ.10 కోట్ల ఆస్తి ఉండాలని షరతు పెట్టాడు. ఈ వింత ప్రకటన పాఠకులను ఆకట్టుకుంది. వెంటనే సామాజిక మాధ్యామాల్లో వైరల్‌ అయిపోయింది. దీనికి నెటిజన్లు అనేక మీమ్స్‌ సృష్టించారు. ప్రకటన ఇచ్చింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయ సంఘం నేతలు స్పష్టంచేశారు.

PREV
click me!

Recommended Stories

ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాలు పడకపోవడమే కాదు.. ల‌క్ష‌ల మంది చ‌నిపోనున్నారు. భార‌త్‌లో కూడా
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?