Justice Pardiwala on Social Media: 'సోషల్ మీడియాపై నియంత్ర‌ణ త‌ప్ప‌నిస‌రి': జస్టిస్​  పర్దీవాలా కీలక వ్యాఖ్యలు

By Rajesh KFirst Published Jul 4, 2022, 6:01 AM IST
Highlights

Justice Pardiwala on Social Media: సోషల్, డిజిటల్ మీడియా గురించి.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​  పర్దీవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్, డిజిటల్ మీడియా దుర్వినియోగంపై జస్టిస్ పార్దీవాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయ వ్యవస్థపై కూడా చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. సోషల్​ మీడియాను తప్పనిసరిగా నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.

Justice Pardiwala on Social Media: సోషల్, డిజిటల్ మీడియాపై  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్ పార్దివాలా కీలక వ్యాఖ్యలు చేశారు. వీటి దుర్వినియోగంపై పార్దీవాలా ఆందోళన వ్యక్తం చేశారు. మెజారిటీ అభిప్రాయాలకు అనుగుణంగా కోర్టు నిర్ణయాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. సున్నితమైన విషయాల్లో సామాజిక, డిజిటల్ మీడియా పాత్రను ఆయ‌న‌ ప్రశ్నించారు.

ఆదివారం నాడు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ పార్దివాలా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కోర్టు నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఒక కేసును విచారిస్తున్నప్పుడు, న్యాయమూర్తులు కొన్నిసార్లు దానిపై సమాజం అభిప్రాయాలను తెలుసుకుంటారు, ఎప్పటికీ తెలియదు, కానీ వారు దానిని ప్రభావితం చేయలేరు. అతను చట్టం ప్రకారం తన చర్య తీసుకుంటాడని తెలిపారు. 

జస్టిస్ పార్దివాలా ఒక ఉదాహరణ ఇస్తూ.. స్వాతంత్య్ర‌ వచ్చిన తర్వాత దేశంలో జ్యూరీ వ్యవస్థను రద్దు చేశార‌నీ, మెజారిటీ అంశంగా పరిగణించడమే ఇందుకు కారణమ‌ని తెలిపారు. మెజారిటీ అభిప్రాయం న్యాయంగా ఉండాల్సిన అవసరం లేదనీ అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాకముందు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన పార్దివాలా స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా ఉదాహరణగా చెప్పారు. సమాజంలోని మెజారిటీ అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సోషల్, డిజిటల్ మీడియా దుర్వినియోగంపై జస్టిస్ పార్దీవాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయ వ్యవస్థపై కూడా చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. నేటి కాలంలో సోషల్, డిజిటల్ మీడియాలు చాలా శక్తివంతమైన మాధ్యమాలు అని న్యాయమూర్తి అన్నారు. చాలాసార్లు వీటి ద్వారా సున్నితమైన విషయాల్లో కోర్టుపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరిచే ప్రయత్నం జరుగుతుందనీ,  ఇలాంటి చ‌ర్య‌ల‌ను నియంత్రణ‌కు ప్రభుత్వం, పార్లమెంటు దీనిని పరిశీలించి తగిన చట్టం చేయాలని అన్నారు.

న్యాయమూర్తులపై వ్యక్తిగత దాడులకు ప్రయత్నించడం ప్రమాదకరమైన పరిణామమని  పర్దీవాలా ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం.. డిజిటల్‌, సోషల్‌ మీడియాలను నియంత్రించడానికి చట్టాల‌ను రూపొందించాల‌ని అన్నారు.  తప్పనిసరిగా నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సోష‌ల్ మీడియా వేదికలపై లక్ష్మణరేఖ దాటుతూ న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగతంగా, దురుద్దేశంతో దాడులకు పాల్పడడం ప్రమాదకరమన్నారు. 

ఇదిలా ఉంటే.. బీజేపీ బ‌హిష్కృత నేత‌ నూపుర్ శర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు సంచ‌ల‌న రేపుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చోట్ల నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ప‌లు చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు త‌ల్లెత్తాయి. ఆమె వ్యాఖ్య‌ల‌పై సుప్రీం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బ‌హిరంగంగా క్ష‌మ‌ప‌ణ చెప్పాల‌ని ఆదేశించింది. ఆమె నోటి దురుసుతో దేశ‌వ్యాప్తంగా మంట‌ల‌ను సృష్టించింద‌ని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసాత్మ‌క సంఘటనలకు ఆమెనే ఏకైక బాధ్యురాలని పేర్కొంది.  విశేషమేమిటంటే.. బీజేపీ నుంచి సస్పెండ్ చేయబడిన నేత నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఈ రోజుల్లో చాలా చర్చ జరుగుతోంది. నుపుర్ కేసును విచారణ జరిపిన ధర్మాసనంలో జస్టిస్ పార్దివాలా సభ్యుడు.

click me!