Lalu Prasad Yadav: మెట్ల‌పై నుంచి జారిప‌డ్డ మాజీ సీఎం.. హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌రలింపు.. ప‌రిస్థితి.. 

By Rajesh KFirst Published Jul 4, 2022, 4:53 AM IST
Highlights

Lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ గాయ‌ప‌డ్డారు. పాట్నాలోని తన నివాసంలో మెట్లపై నుంచి కిందకు వస్తుండ‌గా.. అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

Lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం గాయపడ్డారు. ఆ రాష్ట్ర‌ రాజధాని పాట్నాలోని రబ్రీ నివాసంలో ఆయ‌న గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తుంది. ఆయ‌న త‌న నివాసంలో మెట్లు దిగుతున్న స‌మ‌యంలో..ఆక‌స్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి.. కింద పడిపోయాడు. అనంతరం చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

 ప‌లు మీడియా క‌థ‌నాల ప్ర‌కారం..  లాలూ ప్ర‌సాద్  భుజానికి, నడుముకి  గాయాల‌య్యాయి. ప్రాథమిక పరీక్ష భాగంగా..  కొన్ని టెస్ట్ లు చేశారు. ఈ టెస్ట్ లలో లాలుకి కుడి భుజంలోని ఎముక ఫాక్చర్ కు గురైనట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు కొన్ని రోజుల పాటు కట్టుకట్టారు. వీపుకు కూడా గాయాలైనట్లు గుర్తించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ,  విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 
అతడి కుడి భుజానికి చిన్న ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 

లాలూను ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. లాలూకు గాయం గురించి సమాచారం అందిన వెంటనే,   అతని మద్దతుదారులు నివాసం వద్ద గుమిగూడారు. అయితే లాలూకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు. అయితే.. త‌మ అభిమాన నాయ‌కుడు లాలు ప్రసాద్ యాదవ్ తొందరగా కోల్కోవాల‌ని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కాగా, లాలు ప్రసాద్ గతంలో బీహర్ ముఖ్యమంత్రిగా, రైల్వేశాఖకు మంత్రిగా, లోక్ సభకు ఎంపిగా కూడా పనిచేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న దాణా కుంభకోణం కేసులో జైలు జీవితాన్ని అనుభ‌విస్తున్న ఆయ‌న.. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం, అతను సర్క్యులర్ 10లో ఉన్న ప్రభుత్వ నివాసంలో ఆరోగ్య ప్రయోజనాలను తీసుకుంటున్నాడు.

click me!