కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేసిన మావోలు

By narsimha lodeFirst Published Apr 8, 2021, 3:51 PM IST
Highlights

కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు విడుదల చేశారు. 

రాయ్‌‌పూర్: కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు విడుదల చేశారు.  గురువారం నాడు ఉదయం తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు వదిలివెళ్లారు.ఈ నెల 3వ తేదీన బీజాపూర్‌లో జరిగిన మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో  సుమారు  24 మంది జవాన్లు మరణించారు. ఈ ఎన్ కౌంటర్  సమయంలో కోబ్రా కమాండర్  రాకేశ్వర్ సింగ్  ను మావోయిస్టులు  తమ బందీగా ఉంచుకొన్నారు.

రాకేశ్వర్ సింగ్ ను  క్షేమంగానే ఉన్నాడని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ఫోటోను కూడ విడుదల చేశారు.రాకేశ్వర్ సింగ్ ను  క్షేమంగానే ఉన్నాడని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ఫోటోను కూడ విడుదల చేశారు.

ఈ విషయమై మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు.  అంతేకాదు రాకేశ్వర్ సింగ్  ను విడుదల చేయాలని ఆయన కూతురు ఏడుస్తూ  మావోలను కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఐదు రోజుల పాటు మావోయిస్టుల చెరతో జవాన్ రాకేశ్వర్ సింగ్ ఉన్నారుమావోయిస్టుల నుండి విడుదలైన రాకేశ్వర్ సింగ్ కొద్దిసేపట్లో తమ బెటాలియన్ వద్దకు చేరుకొనే అవకాశం ఉంది.అయితే ఈ విషయమై  పోలీసు అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.  

click me!