స్పీకర్ ఏం చేయాలో మేం ఆదేశించలేం: కర్ణాటక సంక్షోభం‌పై సుప్రీం

Published : Jul 16, 2019, 12:10 PM ISTUpdated : Jul 16, 2019, 12:17 PM IST
స్పీకర్ ఏం చేయాలో  మేం ఆదేశించలేం: కర్ణాటక సంక్షోభం‌పై సుప్రీం

సారాంశం

అసంతృప్త ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం నాడు  సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేసే విషయమై స్పీకర్‌దే తుది నిర్ణయమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. స్పీకర్ ఏం చేయాలో కోర్టు చెప్పబోదని  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు.  


న్యూఢిల్లీ: అసంతృప్త ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం నాడు  సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేసే విషయమై స్పీకర్‌దే తుది నిర్ణయమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. స్పీకర్ ఏం చేయాలో కోర్టు చెప్పబోదని  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు.

ఈ విచారణలో అసంతృప్త ఎమ్మెల్యేల తరపున  రోహత్గీ వాదించారు. రాజీనామాలు సమర్పించిన  ఎమ్మెల్యేలు  సభలో  కొనసాగాలని స్పీకర్ బలవంతపెట్టాలని చూడడం సరైంది కాదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఎమ్మెల్యేల అనర్హతకు, రాజీనామాకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని  రోహత్గీ కోర్టుకు చెప్పారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా రాజీనామా చేశారా...లేదా అనేదే రాజీనామా ఆమోదించడానికి కీలకంగా ఉంటుందని ఆయన చెప్పారు.

రాజీనామా పత్రాన్ని వ్యక్తిగతంగా అందించిన ఎమ్మెల్యే రాజీనామాను స్పీకర్ ఆమోదించాల్సిన అవసరం ఉందని  పిటిషనర్ల తరపు న్యాయవాది గుర్తు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !