మోడీ బయోపిక్‌పై కేసు: విచారణకు స్వీకరించిన సుప్రీం

By Siva KodatiFirst Published Apr 4, 2019, 2:49 PM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘‘పీఎం నరేంద్రమోడీ’’ సినిమాపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 

ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘‘పీఎం నరేంద్రమోడీ’’ సినిమాపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ సినిమాలో మోడీ గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందటం వరకు అన్ని కోణాలను చూపాయనేది కాంగ్రెస్ వాదన.

ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని చూసి ఓటర్లు ప్రభావితం కావచ్చనే ఉద్దేశ్యంతో విపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేయటం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందంటూ ఆరోపించాయి.

మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమన్ పన్వార్ ఈ చిత్ర విడుదలను ఆపాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

కాగా, పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎన్నికల సంఘానికి తెలిపింది. కానీ ఈ సినిమా విడుదలకు తామెప్పుడూ మద్ధతుగానే ఉంటామని చెప్పుకొచ్చింది.

ఇందులో ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధించిన సన్నివేశాలేవి లేవని చెప్పింది. వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. 

click me!