పుల్వామా ఉగ్రదాడి ...కేంద్రం సంచలన నిర్ణయం

By ramya NFirst Published Apr 4, 2019, 10:36 AM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  ఉగ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా బలగాల తరలింపు విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. 

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  ఉగ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా బలగాల తరలింపు విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజులపాటు పౌరుల రాకపోకలను కొన్ని గంటలపాటు నిషేధించాలని కేంద్రం భావిస్తోంది.

ఆ సమయంలో భద్రతా బలగాల తరలింపు చేపట్టనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. వారంలో ప్రతి ఆదివారం, బుధవారాల్లో తెల్లవారుజామున 4 నుంచి 5గంటల వరకు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రవేటు, పౌర వాహనాల రాకపోకలను నిరోధించాలని నిర్ణయించారు. 

ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా ఉగ్రదాడిలో దాదాపు 40మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలను జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో బందోబస్తు కోసం వివిధ ప్రాంతాలకు తరలించనున్న క్రమంలో కేంద్ర పారామిలటరీ దళాలను తరలిస్తున్నపుడు వారానికి రెండు రోజులపాటు జాతీయ రహదారిపై ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేయాలని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. 

కాగా జాతీయ రహదారిపై వారానికి రెండురోజులపాటు పౌరుల వాహనాల రాకపోకలపై విధించిన నిషేధంపై రెండు ప్రధాన పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. 
 

click me!