బోయింగ్ విమానంలో మంటలు: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన

Published : Apr 25, 2019, 10:35 AM ISTUpdated : Apr 25, 2019, 11:46 AM IST
బోయింగ్ విమానంలో మంటలు: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన

సారాంశం

 న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో   ఎయిరిండియా బోయింగ్ విమానంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విమానంలో లోపాలను సరిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం వాటిల్లింది.  


న్యూఢిల్లీ:  న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో   ఎయిరిండియా బోయింగ్ విమానంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విమానంలో లోపాలను సరిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం వాటిల్లింది.

 

ఢిల్లీ నుండి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే ఎయిరిండియా ( బోయింగ్ 777) విమానంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  విమానంలోని  పవర్ సెంటర్‌లో మరమత్తులు చేస్తున్న సమయంలో  అగ్నిప్రమాదం వాటిల్లింది.

ఈ ఘటన బుదవారం అర్ధరాత్రి చోటు చేసుకొంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణీకులు ఎవరూ కూడ లేరని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.

ఈ ఘటనకు సంబంధించి ఎయిరిండియా గురువారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది. బోయింగ్ 777 విమానాన్ని  సాధారణ తనిఖీలు  చేసే సమయంలో 
ఈ ప్రమాదం వాటిల్లిందని  ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

Delhi: ఆగ‌స్టు 4వ తేదీన ప్ర‌ధాని నివాసానికి మార్చ్‌.. మ‌రో ఉద్య‌మానికి సిద్ధం
PM Modi: త‌న త‌ల్లిని దూషించిన వారిపై మోదీ రియాక్ష‌న్‌.. ఆలోజింప‌చేస్తున్న ప్ర‌ధాని మాట‌లు