పోలీస్ స్టేషన్ ముందే బీజేపీ కార్పొరేటర్ భర్తను చితకబాదిన పారిశుద్ధ్య కార్మికులు..

Published : Oct 14, 2022, 01:23 PM IST
పోలీస్ స్టేషన్ ముందే బీజేపీ కార్పొరేటర్ భర్తను చితకబాదిన పారిశుద్ధ్య కార్మికులు..

సారాంశం

ఓ బీజేపీ కార్పొరేటర్ భర్త మీద పారిశుద్ధ్య కార్మికులు దాడి చేశారు. తోటి మహిళా కార్మికురాలిపై అతను అసభ్యంగా మాట్లాడడంతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. 

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పారిశుద్ధ కార్మికుల బృందం బీజేపీ కార్పొరేటర్ భర్తను పోలీస్ స్టేషన్ ముందే చితకబాదేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని రౌ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సందీప్ చౌహాన్ పై ఫిర్యాదు చేసేందుకు పారిశుద్ధ్యం కార్మికులు పెద్ద ఎత్తున సమూహంగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సదరు వ్యక్తి ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని ఫోన్ లో దుర్భాషలాడడంతో.. ఆమె బంధువులు, తోటి కార్మికులు ఆగ్రహావేశాలతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. 

దీంతో పోలీసులు సందీప్ చౌహాన్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఇద్దరి మధ్య సమస్య రాజీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తలెత్తి చౌహాన్ మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు పారిశుద్ధ్య కార్మికులు. అంతేగాదు ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని, బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఐతే చౌహాన్ భార్య 13వ వార్డు రౌ మున్సిపాలిటీ బీజేపీ కార్పొరేటర్.

ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట.. నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు...వెంటనే విడుదలకు ఆదేశాలు..

ఇదిలా ఉండగా, అక్టోబర్ 9న గుజరాత్ లో ఇలాంటి ఘటనే జరిగింది. గుజ‌రాత్ లోని నవ్‌సారి జిల్లాలో గిరిజన నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన అనంత్ పటేల్‌పై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శనివారం రాత్రి భారీ ఎత్తున జనం ఒక్క చోట గుమిగూడి, నిర‌స‌న‌లు తెలియ‌జేశారు. ఈ నేపథ్యంలో ఆందోళ‌న‌కారులు ఓ దుకాణానికి నిప్పంటించారు. మంట‌లు ఆర్పేందుకు వ‌చ్చిన ఫైర్ ఇంజ‌న్ ను కూడా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు మ‌ద్ద‌తుగా నినాదాలు చేస్తూ.. వీధుల్లో తిరిగారు. దాడికి కార‌ణం అయిన వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

నవ్‌సారి జిల్లాలోని ఖేర్గాం పట్టణంలో శ‌నివారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, గిరిజన నాయకుడు అనంత్ పటేల్ పై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఆయ‌న కారును ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎమ్మెల్యే తలకు గాయమైంది. అయితే, ఈ దాడికి ఆ జిల్లా పంచాయతీ అధ్య‌క్షుడు, అత‌డి అనుచరులు కారణమని ఎమ్మెల్యే అనంత్ ప‌టేల్ ఆరోపించారు. ‘‘ నేను మీటింగ్ కోసం ఖేర్గాంకు వెళ్లాను. ఆ స‌మ‌యంలో జిల్లా పంచాయితీ చీఫ్, ఆయ‌న గూండాలు నా కారును ధ్వంసం చేశారు. నన్ను కొట్టారు. వారు కోపంతో నన్ను దూషించారు. ‘ఆదివాసి కావడం వల్లే నాయకుడిగా ఎదుగుతున్నారని, మిమ్మల్ని విడిచిపెట్టం. ఒక ఆదివాసీని ఇక్కడ ఎదగనివ్వం’ అని నాతో అన్నారు. ఈ దాడికి కారణమైన వారు పట్టుబడే వరకు నిరసన తెలియజేస్తాం ’’ అని ఎమ్మెల్యే అన్నారు. 

ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం అయిన వారిని పట్టుకునేంత వ‌ర‌కు ఆదివాసీలు 14 జిల్లాల రహదారులను దిగ్బంధించి నిరసనలు తెలియ‌జేస్తార‌ని ఎమ్మెల్యే అనంత్ ప‌టేల్ హెచ్చ‌రించారు. ‘బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎవరైనా గళం విప్పితే వారిని కొట్టి, జైలుకు పంపిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం