ఢిల్లీ లిక్కర్ స్కాం: ఢిల్లీలో 25 చోట్ల ఈడీ సోదాలు

Published : Oct 14, 2022, 12:27 PM ISTUpdated : Oct 14, 2022, 01:29 PM IST
 ఢిల్లీ లిక్కర్ స్కాం: ఢిల్లీలో 25 చోట్ల ఈడీ సోదాలు

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దేశంలోని 25 చోట్ల ఈడీ అధికారులు శుక్రవారంనాడు సోదాలు నిర్వహిస్తున్నారు.  సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు సోదాలుచేస్తున్నారు

న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఢిల్లీలోని  25 చోట్ల ఈడీ అధికారులు శుక్రవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు అమిత్  దినేష్ ఆరోరా  కేంద్రంగా  సోదాలు చేస్తున్నారు.సమీర్ మహేంద్రు  ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్నటితో సమీర్ మహేంద్రు  ఈడీ కస్టడీ ముగిసింది. విజయ్ నాయర్ తో పాటు అభిషేక్ రావులను సీబీఐ  అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి  ఢిల్లీలో  25 చోట్ల సోదాలు  నిర్వహిస్తున్నారు. గతవారంలో ఢిల్లీ,  పంజాబ్ ,హైద్రాబాద్  రాష్ట్రాల్లోని 35 చోట్ల  ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు..ఈ కేసులో దేశంలో ఇప్పటి వరకు 120 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ కేసులో గత మాసంలో మద్యం తయారీ కంపెనీకి చెందిన  వ్యాపార వేత్త సమీర్ మహేంద్రు అరెస్టైన విషయం తెలిసిందే.

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: బోయినపల్లి అభిషేక్ రావు కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు

ఢిల్లీ  లెఫ్టినెంట్ గవర్నర్ వికే  సక్సేనా  ఢిల్లీ ఎక్సైజ్  పాలసీ 2021-2022 అమలులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించారు.   ఈ విషయమై 11 మంది ఎక్సైజ్ అధికారులను కూడా  సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు  పలువురిపై సీబీఐ కేసులు న మోదు చేసింది.  హైద్రాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది.  గత ఏడాది నవంబర్ నుండి ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. అయితే సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఈ ఏడాది జూలైలో ఈ పాలసీని అరవింద్ కేజ్రీవాల్ ఈ పాలసీని రద్దు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం  విషయంలో ఆప్ ప్రభుత్వం పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.  తెలంగాణ లో అధికారంలో ఉన్న పార్టీకిచెందిన కొందరికి ఈ స్కాంలో పాత్ర ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను టీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. రాజీకంగా తమపై బురద చల్లేందుకు బీజేపీ ఈ ఆరోపణలు  చేస్తుందని టీఆర్ఎస్ విమర్శలు చేసింది. తెలంగాణలోని హైద్రాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్ట్  చేయడంతో  ప్రస్తతం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అభిషేక్ రావు కస్డడీని మరో రెండు రోజుల పాటు నిన్ననే సీబీఐ కోర్టు పొడిగించింది. ఇప్పటికే మూడురోజుల పాటు అభిషేక్ రావును సీబీఐ విచారించింది. 



 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu