కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం: 13 మంది రోగులు దుర్మరణం

Published : Apr 23, 2021, 07:14 AM ISTUpdated : Apr 23, 2021, 07:59 AM IST
కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం: 13 మంది రోగులు దుర్మరణం

సారాంశం

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 13 మంది రోగులు మృత్యువాత పడ్డారు. నాసిక్ ఘటనను మరిచిపోక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.

ముంబై: మహారాష్ట్రలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని వాసాయి విరార్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల విజయ్ వల్లభ కోవిడ్ ఆస్పత్రిలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. నాసిక్ లో జరిగిన ప్రమాదాన్ని మరిచిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం దిగ్భాంతి కలిగిస్తోంది.

ఐసీయులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మిగతా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. గుర్తు పట్టరానంతగా మృతదేహాలు కాలిపోయాయి.  ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 90 మంది రోగులు ఉన్నట్లు విజయ్ వల్లభ్ ఆస్పత్రి సీఈవో దిలీప్ షా మీడియా ప్రతినిధులకు చెప్పారు. 

మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయ తెలిసిందే. నిన్నటి నుంచి 67లకు పైగా తాజా కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word