
మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ హింసాత్మక ఆందోళన చేసిన నిందితులను యూపీ పోలీసులు గుర్తించారు. ఈ నిందితుల్లో ఇద్దరు అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారని నిర్ధారించుకుంటున్న ప్రభుత్వం వారి ఆస్తులను శనివారం కూల్చివేసింది. ఈ హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న 64 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు.
నాగాలాండ్ కాల్పుల కేసు.. 30 మంది ఆర్మీ సిబ్బందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
ఈ హింసకు సంబంధించి 200 మందికి నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులందరిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) ను విధించనున్నట్టు కూడా పోలీసులు తెలిపారు. నగరంలో శుక్రవారం చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించి అరెస్టయిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అక్రమ ఆస్తులను బుల్డోజర్ సాయంతో కూలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
ఈ విషయంలో సహరన్‌పూర్ ఏఎస్పీ ఆకాశ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సహరాన్ పూర్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ అథారిటీ, మేజిస్ట్రేసీ, రెవెన్యూ బృందం, మునిసిపల్ కార్పొరేషన్, పోలీసుల సంయుక్త బృందం నిన్నటి సంఘటనలో నిందితుల అక్రమ ఆస్తులపై చర్యలు తీసుకునేలా చేసింది. ఇప్పటి వరకు 64 మందిని అరెస్టు చేశాం. 200 మందికి పైగా నిందితులను గుర్తించాం. అరెస్టయిన ఇద్దరు నిందితుల నివాస ప్రాంగణాలు చట్టవిరుద్ధంగా ఉన్నాయి. వాటికి అనుమతి లేదు. మేము బుల్డోజర్లతో చర్యలు తీసుకున్నాం. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరింత మందిని గుర్తించేందకు ప్రయత్నాలు చేస్తున్నాం.’’ అని ఆయన అన్నారు.
కోవిడ్‌తో భర్త దూరం.. అయినా జ్ఞాపకాలు పదిలం, లాకెట్‌లో ఆయన అస్థికలు పెట్టుకున్న భార్య
ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల తరువాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనేక హింస, నినాదాలు, రాళ్ళు రువ్విన ఘటనలు జరిగాయి. నూపుర్ శర్మ ప్రకటనలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు.ఇది తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ప్రయాగ్ రాజ్ లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఓ వర్గం నిరసనకారులు వాహనాలకు నిప్పుపెట్టారు, ఆస్తులను ధ్వంసం చేశారు. రహదారులను దిగ్బంధించారు. కాగా ఇటీవల యూపీలోని కాన్పూర్ లో జరిగిన మత ఘర్షణలో కూడా పోలీసులు 1500 మందిపై కేసులు నమోదు చేశారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై చేపట్టిన నిరసనలే ఈ ఉద్రికత్తలకు కారణం అయ్యాయి. ఇదిలా ఉండగా జ్ఞాన్ వ్యాపి మసీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో నూపుర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల అరాధ్యుడైన మహ్మద్ ప్రవక్తపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. గల్ప్ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి.