ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య, ప్రముఖ జర్నలిస్టు సాగరికా ఘోష్ రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్నారు. టీఎంసీ ఆమెను తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.
Rajdeep Sardesai: ప్రముఖ జర్నలిస్టు, ఇండియా టుడే న్యూస్ చానెల్, సోషల్ మీడియా వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించే రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య రాజ్యసభ బరిలో ఉన్నారు. రైట్ వింగ్ వర్కర్లు రాజ్‌దీప్ సర్దేశాయ్ పై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ చేస్తారని తెలిసిందే. ఆయన కూడా ఏ పోస్టు పెట్టినా.. దాదాపుగా ప్రభుత్వాన్ని విమర్శనాత్మక కోణంలో బోనులో పెడతారు. కేంద్రంలోని బీజేపీ ఉన్నా.. మరే పార్టీ ఉన్నా ఆయన తరుచూ ప్రభుత్వంపై విమర్శనాత్మక ధోరణితో వ్యవహరిస్తుంటారు. రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య సాగరికా ఘోష్ కూడా ప్రభుత్వంపై విమర్శనాత్మక కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమెను పశ్చిమ బెంగాల్ అధికారిక పార్టీ టీఎంసీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.
సాగరికా ఘోష్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఔట్ లుక్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రఖ్యాత సంస్థల్లో పని చేశారు. లిబరల్‌గా ఉంటారు. ముఖ్యంగా రైట్ వింగ్ విధానాలను విమర్శిస్తూ ఉంటారు. మతువా కమ్యూనిటీకి చెందిన సాగరికా ఘోష్‌ను టీఎంసీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. మమతా బాలా ఠాకూర్, నడిముల్ హక్ సుస్మితా దేవ్‌లనూ టీఎంసీ నామినేట్ చేసింది.
undefined
Also Read: Evil: ఏపీలోని ఆ గ్రామంలో భయానక అదృశ్య శక్తి? తెల్లార్లు మెలకువతోనే యువత కాపలా.. అసలేం జరుగుతున్నది?
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌తోపాటు బిహార్, ఛత్తీస్‌గడ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది.