తీవ్ర అస్వస్థతకు గురైన తన తాతను ఓ వ్యక్తి బైక్‌పై ఎక్కించుకుని ఆసుపత్రికి ఎమర్జెన్సీ వార్డు లోపలికి తీసుకొచ్చాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పుడెప్పుడో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటించిన ‘‘త్రి ఇడియట్స్ ’’ చిత్రంలో అస్వస్థతకు గురైన ఓ పెద్దాయనను హీరో తన బైక్‌పై ఎక్కించుకుని సరాసరి ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తాడు. ఈ సీన్ ఆ సినిమాకే హైలెట్.. రీల్ లైఫ్‌లో జరిగిన ఈ సీన్ ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తీవ్ర అస్వస్థతకు గురైన తన తాతను ఓ వ్యక్తి బైక్‌పై ఎక్కించుకుని ఆసుపత్రికి ఎమర్జెన్సీ వార్డు లోపలికి తీసుకొచ్చాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో ఈ ఘటన జరిగింది.
శనివారం అర్ధరాత్రి నీరజ్ గుప్తా అనే వ్యక్తి తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి.. సహాయంతో తాతను బైక్‌పై కూర్చోబెట్టి సత్నాలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌ను నడిపించాడు. వెనుక కూర్చొన్న మరో వ్యక్తి అక్కడి సిబ్బంది కలిసి అచేతనంగా వున్న ఆ వృద్ధుడిని బైక్ నుంచి కిందకు దించి బెడ్‌పై పెట్టి వెంటనే చికిత్స ప్రారంభించారు.
అయితే ఎమర్జెన్సీ వార్డులోకి బైక్ రావడంతో అక్కడున్న రోగులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది తొలుత కంగారు పడ్డారు. తర్వాత విషయం తెలుసుకుని నీరజ్ సమయస్పూర్తిని మెచ్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
He rode his motorbike right up to the Emergency ward of a hospital in Madhya Pradesh, his grandfather behind him was held up by another man, mirroring a scene from Aamir Khan blockbuster '3 Idiots'. pic.twitter.com/eGCKoqiiA7
— sarfaraz adil (@sarfarazadil21)