పఠాన్ వివాదం: దీపికా పదుకొనే ముఖం సీఎం యోగి ఫొటోతో మార్ఫింగ్.. కేసు నమోదు

Published : Dec 19, 2022, 02:56 PM ISTUpdated : Dec 19, 2022, 02:59 PM IST
పఠాన్ వివాదం: దీపికా పదుకొనే ముఖం సీఎం యోగి ఫొటోతో మార్ఫింగ్.. కేసు నమోదు

సారాంశం

పఠాన్ సినిమాపై మరో వివాదం రేగింది. ఆరెంజ్ కలర్ బికినీ వేసుకున్న దీపికా పదుకొనే ముఖం దగ్గర ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఫొటోను పెట్టారు. ఈ మార్ఫ్డ్ పిక్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ యూజర్ పై కేసు నమోదైంది.  

లక్నో: బాలీవుడ్ మూవీ పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్ పాట విడుదలైనప్పటి నుంచి వివాదాలు ముసురుతూనే ఉన్నాయి. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహాంల ప్రధాన పాత్రలతో ఈ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్రయూనిట్ బేషరమ్ రంగ్ పాట విడుదల చేశారు. ఇందులో దీపికా పదుకొనే ఆరెంజ్ కలర్ బికినీ వేసుకున్న షాట్స్ ఉన్నాయి. ఈ బికినీ కలర్ కాషాయం కావడంపై అభ్యంతరాలు వచ్చాయి. చాలా మంది నేతలు విమర్శలు చేశారు. తాజాగా, ఆరెంజ్ కలర్ బికినీ వేసుకుని షారూఖ్ ఖాన్ ఒడిలో ఉన్న దీపికా పదుకొనే ముఖం వద్ద ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఫొటో పెట్టిన ఇమేజ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. లక్నో పోలీసులు ఆ ట్విట్టర్ హ్యాండిల్ పై కేసు కూడా నమోదు చేశారు.

అజార్ఎస్ఆర్‌కే పేరున్న ట్విట్టర్ హ్యాండిల్ దీపికా ముఖం దగ్గర యూపీ సీఎం యోగి ముఖాన్ని అంటించిన చిత్రాన్ని (మార్ఫ్డ్ ఫొటో)ను పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అభ్యంతరకరం అని, అవమానకరం అని, సీఎం ఫొటోను ఇలా మార్ఫ్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: కాషాయం ధరించి ఆ పని చేసినా తప్పులేదు.. దీపికా సినిమాలో డ్రెస్ వేసుకుంటే తప్పా.. ప్రకాష్ రాజ్ కామెంట్స్

ఐపీసీలోని 295 ఏ సెక్షన్, ఐటీ యాక్ట్‌లోని 66 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును డీజీపీ హెడ్‌క్వార్టర్ సైబర్ టీమ్ దర్యాప్తు చేస్తున్నది. జనవరి 25వ తేదీన పఠాన్ సినిమా విడుదల కానుంది.

PREV
click me!

Recommended Stories

Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu
ఎవ్వరికీ సాధ్యం కాని మోదీ హిస్టారికల్ రికార్డ్ | Modi Creates History | Asianet News Telugu