దీపావళి రోజు పిల్లలను పటాకులు కాల్చనివ్వండి.. వారి కోసం ఇలా చేయండి.. సద్గురు జగ్గీ వాసుదేవ్ సందేశం..

By team telugu  |  First Published Nov 3, 2021, 2:40 PM IST

పిల్లలను పటాకులు (Firecrackers) పేల్చడం అనే సరదా నుంచి దూరం చేయవద్దని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) అన్నారు. పటాకుల వల్ల కాలుష్యం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నవారికి ఆయన ప్రత్యామ్నాయ మార్గం సూచించారు. 


పిల్లలను పటాకులు (Firecrackers) పేల్చడం అనే సరదా నుంచి దూరం చేయవద్దని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) అన్నారు. పటాకుల వల్ల కాలుష్యం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నవారికి ఆయన ప్రత్యామ్నాయ మార్గం సూచించారు. దీపావళి పండగ వేళ పటాకులు పేల్చడంపై నిషేధం గురించి చర్చ జరుగుతున్న వేళ.. సద్గురు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాణసంచా కాల్చడంపై నిషేధాన్ని ఆయన వ్యతిరేకించారు. పిల్లల గురించి పెద్దలు త్యాగం చేయాలని సూచించారు. కాలుష్యం పెరుగుతందనే ఆందోళన నేపథ్యంలో.. పెద్దలు మూడు రోజులు ఆఫీసులకు నడుచుకుంటూ వెళ్లాలని.. పిల్లలు పటాకులు పేల్చి ఆనందపడేలా చూడాలని అన్నారు.

Also read: బాణసంచా వాడకంపై యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కీలక ఆదేశాలు.. ఎన్సీఆర్‌తో పాటుగా పలు ప్రాంతాల్లో నిషేధం..

Latest Videos

undefined

అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన సద్గురు.. ‘మిమ్మల్ని చీకటిలోకి నెట్ట గల సంక్షోభ సమయాల్లో.. ఆనందం, ప్రేమ, స్పృహతో వెలుగులు నింపడం చాలా అవసరం. ఈ దీపావళి రోజున.. మీ మానవత్వాన్ని దాని పూర్తి కీర్తితో వెలిగించండి’ అని సద్గురు పేర్కొన్నారు. 

 

Concern about air pollution is not a reason to prevent kids from experiencing the joy of firecrackers. As your sacrifice for them, walk to your office for 3 days. Let them have the fun of bursting crackers. -Sg pic.twitter.com/isrSZCQAec

— Sadhguru (@SadhguruJV)

‘కొన్నేళ్ల నుంచి నేను పటాకులు పేల్చడం లేదు. కానీ నేను పిల్లాడిగా ఉన్నప్పుడు.. పటాకులు పేల్చడం చాలా బాగుండేది. సెప్టెంబర్ నుంచే పటాకులు కాల్చడం గురించి ఎదురుచూసేవాళ్లం. దీపావళి అయిపోయిన తర్వాత కూడా పటాకులను దాచుకుని.. తర్వాత రెండు నెలల పాటు ప్రతి రోజు కాల్చేవాళ్లం. అయితే పర్యావరణ వేత్తలు పిల్లలు క్రాకర్స్ కాల్చకూడదు అనడం సరైనది కాదు. ఇది మంచి మార్గం కాదు. పిల్లలు టపాసులు కాల్చకుండా ఉండేందుకు వాయు కాలుష్యం ఆందోళన కారణం కాకూడదు. పర్యావరణం గురించి, గాలి కాలుష్యం గురించి ఆందోళన చెందుతున్నారో వారు ఇలా చేయండి.. మీరు పిల్లల కోసం త్యాగం చేయండి. దీంతో పిల్లలు ఎంజాయ్ చేయడానికి వీలు కలుగుతుంది. పెద్దలు పటాకులు కాల్చడం ఆపేయండి. అంతేకాకుండా మూడు రోజులు ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లండి. కారులో వెళ్లకండి. పిల్లలు పటాకులు కాలుస్తూ ఆనందంగా గడపనివ్వండి’ అని సద్గురు వీడియో మెసేజ్‌లో పేర్కొన్నారు. 

ఇక, కాళీ పూజ, దీపావళి.. వంటి పండుగ సీజన్లలో పటాకులు కాల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. బాణ సంచాపై పూర్తి నిషేధం ఉండకూడదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పటాకల్లో విషపూరిత రసాయనాలు వాడకుండా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. గాలి నాణ్యత మోడరేట్‌గా ఉన్న ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం కోర్టు అనుమతించింది. ఇక, బేరియం లవణాలు ఉన్న బాణాసంచాపై సుప్రీం కోర్టు ఇటీవల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

click me!