విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

Published : Nov 03, 2021, 10:20 AM ISTUpdated : Nov 03, 2021, 03:29 PM IST
విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

సారాంశం

ఇటలీ, వాటికన్ సిటీ, యూకేలలో ఐదు రోజుల  పర్యటన ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఆయనకు ఎయిర్​ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు.

ఇటలీ, వాటికన్ సిటీ, యూకేలలో ఐదు రోజుల  పర్యటన ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఆయనకు ఎయిర్​ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ అక్టోబర్ 29న ఇటలీ, యూకే పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత రోమ్ నగరంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ రెండు రోజుల జీ20 సదసులో పాల్గొన్నారు. అంతేకాకుండా వాటికన్ సిటీకి చేరుకుని అక్కడ పోప్ ఫ్రాన్సిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిన్‌ను భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానం అందించారు. 

జీ 20 సదస్సు సందర్భంగా వివిధ దేశాల అధినేతలతో భారతదేశం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. వారితో పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత మోదీ యూకే బయలుదేరి వెళ్లారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన ఐకరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు  (COP26)కి మోదీ హాజరయ్యారు. అక్కడ యూకే, ఆస్ట్రేలియా దేశాధినేతలను మోదీ కలుసుకన్నారు. 

Also read: Patna serial blasts: మోదీ ర్యాలీ వద్ద పేలుళ్ల కేసు.. నలుగురు దోషులకు ఉరి శిక్ష.. ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

ఇక, ప్రధాని మోదీ.. వ్యాక్సినేషన్‌పై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన జిల్లాల (low vaccine coverage) అధికారులతో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ 50 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లా, రెండో డోస్ తక్కువగా ఉన్న జిల్లాల అధికారులతో మోదీ సమీక్ష చేపట్టనున్నారు. అయితే భారత్‌ గత వారం కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Vaccination) పంపిణీ 100 కోట్ల డోసుల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ ఘనతను దేశ సామర్థ్యానికి, నవ భారతదేశానికి చిహ్నంగా మోదీ కొనియాడారు.

Also read: విదేశాల​ నుంచి రాగానే వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ కీలక సమీక్ష.. ఆ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడనున్న మోదీ..

‘జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయలతో సహా ఇతర రాష్ట్రాల్లో టీకా పంపిణీ తక్కువగా ఉన్న మొత్తం 40 జిల్లాలో కలెక్టర్లత మోదీ మాట్లాడతారు. ఈ సమీక్షలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వర్చువల్‌గా పాల్గొంటారు’అని ప్రధాని కార్యాలయం తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్