Dengue Outbreak: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. పలు రాష్ట్రాలకు నిపుణులతో కూడిన కేంద్ర బృందాలు

By team teluguFirst Published Nov 3, 2021, 11:17 AM IST
Highlights

దేశంలోని పలుచోట్ల డెంగ్యూ కేసులు (dengue cases) డేంజర్ బెల్స్ మోగిస్తుంది. పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు భారీగా పెరగడంతో.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమ్తమైంది. దీంతో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిపుణులతో కూడిన బృందాలను (Central Teams) పంపింది.

దేశంలోని పలుచోట్ల డెంగ్యూ కేసులు (dengue cases) డేంజర్ బెల్స్ మోగిస్తుంది. హర్యానా, పంజాబ్, కేరళ, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌లో డెంగ్యూ కేసులు భారీగా పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమ్తమైంది. డెంగ్యూను ఎదుర్కొవడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహకారం అందించేందుకు, అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు వైద్య నిపుణులతో కూడిన బృందాలను (Central Teams) పంపినట్టుగా కేంద్రం తెలిపింది. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ బృందాలను పంపినట్టుగా వెల్లడించింది. నిపుణుల బృందాలలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అధికారులు ఉంటారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 

డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించినట్టుగా ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 1,16,991 డెంగ్యూ కేసులు నమోదయ్యయాని తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో కొన్ని రాష్ట్రాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి గరిష్ట కేసులను నమోదు చేసుకన్నాయి. అక్టోబర్ 31 వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 86 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉన్నాయని health ministry తెలిపింది. 

Also read: విదేశాల​ నుంచి రాగానే వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ కీలక సమీక్ష.. ఆ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడనున్న మోదీ..

నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో ఎక్కువ కేసులు నమోదైన తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించినట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రజారోగ్య ప్రతిస్పందనను అందించడానికి, సహాయపడటానికి, మద్దతు ఇవ్వడానికి పనిచేస్తాయని తెలిపింది. అక్కడ పలు విషయాలను గమనించి నిదేదిక సమర్పించాలని తాము బృందాలను కోరినట్టుగా పేర్కొంది. 

నిపుణుల బృందాలు వారి పరిశీలనలో గుర్తించిన విషయాలను ఆయా రాష్ట్రాలు ఆరోగ్య అధికారులకు కూడా తెలియజేస్తారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

click me!