సచిన్ సహా 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు: సుప్రీంకు వెళ్లే యోచనలో పైలెట్

By narsimha lodeFirst Published Jul 16, 2020, 2:46 PM IST
Highlights

రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ  ఇచ్చిన నోటీసుపై మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.సచిన్ పైలెల్ సహా ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
 

న్యూఢిల్లీ:రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ  ఇచ్చిన నోటీసుపై మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.సచిన్ పైలెల్ సహా ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.

also read:బీజేపీలో చేరడం లేదు, నేను ఇంకా కాంగ్రెస్ సభ్యుడినే: సచిన్ పైలెట్

రాజ్యాంగంలోని 191 ఆర్టికల్ లోని 10వ షెడ్యూల్ లో 1989 అనర్హత రూల్స్ ప్రకారంగా  కాంగ్రెస్ పార్టీ చీప్ విప్ మహేష్ జోషీ పిటిషన్ ఇచ్చారు.
సచిన్ పైలెట్ సహా ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు  ఈ నెల 17వ తేదీన స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఎమ్మెల్యేల అధికార నివాసాలకు ఈ నోటీసులు అంటించారు. 

ఈ నోటీసులపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో సచిన్ పైలెట్ ఉన్నట్టుగా ఆయన వర్గీయులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్ పదవి నుండి సచిన్ పైలెట్ ను తప్పిస్తూ కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకొంది. 

వాస్తవమే ఎప్పటికైనా విజయం సాధిస్తోందని  తనను పదవుల నుండి తప్పించిన తర్వాత సచిన్ పైలెట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

click me!