పక్కింట్లో టీవీ పెట్టమని అడిగినందుకు..

Published : Jul 16, 2020, 12:43 PM ISTUpdated : Jul 16, 2020, 12:52 PM IST
పక్కింట్లో టీవీ పెట్టమని అడిగినందుకు..

సారాంశం

ఆ ఇంటి యాజమాని తన తండ్రితో ఏదో విషయంలో గొడవ పడుతున్నాడు. అదే సమయంలో పాప టీవీ పెట్టమని అడగంతో ఆ కోపాన్ని చిన్నారిపై చూపిస్తూ  దారుణానికి ఒడిగట్టాడు.  

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్లిన ఓ చిన్నారి... అక్కడ టీవీ పెట్టమని అడగడం పాపమైపోయింది.  టీవీ పెట్టమని అడిగినందుకు.. గొంతు పిసికి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మూడో తరగతి చదువుతున్న చిన్నారి తన తల్లితోపాటు చెన్నైలోని తూటికోరిన్ జిల్లాలో నివసిస్తోంది. ఇంట్లో టీవీ‌ లేకపోవడంతో అప్పుడప్పుడు పక్కన వాళ్ల ఇంట్లోకి వెళ్లి చూసేది. కాగా.. బుధవారం కూడా బాలిక పక్కింటికి వెళ్లి టీవీ పెట్టమని అడిగింది. అదే బాలిక పట్ల శాపంగా మారింది.

అయితే అప్పటికే ఆ ఇంటి యాజమాని తన తండ్రితో ఏదో విషయంలో గొడవ పడుతున్నాడు. అదే సమయంలో పాప టీవీ పెట్టమని అడగంతో ఆ కోపాన్ని చిన్నారిపై చూపిస్తూ  దారుణానికి ఒడిగట్టాడు.

బాలిక గొంతు కోసి చంపి ఆమె శవాన్ని ప్లాసిక్‌ డ్రమ్‌లో కప్పి మూత పెట్టాడు. అనంతరం తన ఇంటి సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మృతదేహాన్ని నీటిలో పడేశాడు. మృతదేహాన్ని నీటిలో పడేయం చూసిన ఓ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నీటి నుంచి చిన్నారి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం నిందితుడిని అతనికి సాయం చేసిన స్నేహితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu