బహుశా సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడారేమో.. నాతో కాదు: రీటా వ్యాఖ్యలకు సచిన్ పైలట్ కౌంటర్

By Siva KodatiFirst Published Jun 11, 2021, 8:21 PM IST
Highlights

రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్‌ పైలట్‌ బీజేపీలో చేరతారంటూ ఆ పార్టీ నేత రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలపై సచిన్ పైలట్‌ స్పందించారు. ఈ విషయంపై తాను సచిన్‌తో మాట్లాడానని రీటా చెప్పగా.. ఆమెకు తనతో మాట్లాడే ధైర్యం లేదని ఆయన ఘాటుగా స్పందించారు.

రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్‌ పైలట్‌ బీజేపీలో చేరతారంటూ ఆ పార్టీ నేత రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలపై సచిన్ పైలట్‌ స్పందించారు. ఈ విషయంపై తాను సచిన్‌తో మాట్లాడానని రీటా చెప్పగా.. ఆమెకు తనతో మాట్లాడే ధైర్యం లేదని ఆయన ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ...‘సచిన్‌తో మాట్లాడానని రీటా బహుగుణ చెప్పారు.. బహుశా ఆమె సచిన్‌ టెండూల్కర్‌తో మాట్లాడి ఉండొచ్చంటూ సెటైర్లు వేశారు.

కొద్ది నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో సచిన్ పైలట్ కూడా పార్టీని వీడుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో తన మద్ధతుదారులతో కలిసి సచిన్ తిరుగుబాటు చేయగా.. అధిష్ఠానం ఆయన్ను బుజ్జగించింది.

Also Read:కాంగ్రెస్‌కు పనికిరాని వాడు.. కాషాయానికి ప్లస్ అవుతాడా, జీతిన్ రాకపై సంబరాలెందుకు: బీజేపీకి శివసేన చురకలు

ఈ పరిణామంతో పార్టీ మార్పుపై వచ్చిన వార్తలు అప్పట్లో సద్దుమణిగాయి. మళ్లీ జితిన్ ప్రసాద కారణంగా మరోసారి సచిన్ పైలట్ పార్టీ మారుతారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ త్వరలోనే బీజేపీలో చేరతారని.. కాంగ్రెస్ ఆయన్ను గౌరవించలేదు అంటూ రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా సచిన్ ఈ వ్యాఖ్యల్ని ఖండించడంతో ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది. 

click me!