రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం: సీఎం పదవే ముద్దు, సచిన్ గ్రూప్‌పై చర్యలకు సీఎల్పీ తీర్మానం

By narsimha lodeFirst Published Jul 14, 2020, 1:30 PM IST
Highlights

సచిన్ పైలెట్ సీఎం పదవిని కోరుకొంటున్నారు. ఈ పదవి మినహా ఇతర డిమాండ్లను ఆయన పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ లో చోటు చేసుకొన్న సంక్షోభం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు.

న్యూఢిల్లీ: సచిన్ పైలెట్ సీఎం పదవిని కోరుకొంటున్నారు. ఈ పదవి మినహా ఇతర డిమాండ్లను ఆయన పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ లో చోటు చేసుకొన్న సంక్షోభం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లతో చర్చల సందర్భంగా ఆయన తన డిమాండ్ ను పార్టీ నాయకత్వం ముందు ఉంచాడు. సీఎం పదవి మినహా  డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవి తనకు అవసరం లేదని పైలెట్ తేల్చి చెప్పినట్టుగా  సమాచారం.

రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండో సీఎల్పీ సమావేశానికి పైలెట్ రెండో సారి హాజరు కాలేదు. సోమవారం నాడు తొలి మీటింగ్ జరిగింది. ఇవాళ రెండో మీటింగ్ జరిగింది.ఈ రెండు సమావేశాలకు సచిన్ మాత్రం హాజరు కాలేదు. సీఎల్పీ సమావేశాలకు హాజరుకాకుండా సచిన్ పైలెట్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 సమావేశానికి హాజరుకాని పైలెట్ సహా ఇతర  ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం నాడు సీఎల్పీ తీర్మానం చేసింది.ఈ సమావేశానికి హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచించింది. కానీ సచిన్ పైలెట్ మాత్రం సమావేశానికి హాజరు కాలేదు.

సచిన్ పైలెట్ పై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. పార్టీ నుండి ఆయనను బహిష్కరించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుండి పైలెట్ ను తప్పించే అవకాశం ఉందని సమాచారం. సీఎల్పీ సమావేశానికి హాజరుకాని పైలెట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

also read:రాజస్థాన్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంక్షోభం: బల నిరూపణ చేసుకోవాలని సచిన్ వర్గం డిమాండ్

ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశానికి పైలెల్ సహా 16 మంది హాజరు కాలేదు.  సోమవారం నాడు కూడ వీరంతా ఈ సమావేశానికి దూరంగానే ఉన్నారు.సీఎల్పీ సమావేశానికి హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సచిన్ పైలెట్ కు రెండోసారి అవకాశం ఇచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ అవినాష్ పాండే చెప్పారు.

రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం ఈ నెల 12వ తేదీన వెలుగు చూసింది. తనకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందని పైలెట్ ప్రకటించారు. ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలెట్ ఢిల్లీకి చేరుకొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పలుమార్లు సచిన్ పైలెట్ తో చర్చించినా కూడ ఆయన మెత్తబడలేదు.

click me!