'పడి పూజ' సమయంలో వర్షాలతో ఇబ్బంది లేకుండా ఆలయంలో 'పతినెట్టం పడి' పైకప్పుగా హైడ్రాలిక్ రూఫ్ ఏర్పాటు చేశారు.
తిరువనంతపురం : ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప దేవాలయం రెండు నెలల పాటు జరిగే మండల తీర్థయాత్ర కోసం గురువారం సాయంత్రం తెరుచుకుంది. సాయంత్రం 5.00 గంటలకు తంత్రి కాంతారావు మహేశ్ మోహనరావు గర్భాలయాన్ని ప్రారంభించారు. దీంతో నూతనంగా ఎన్నికైన ప్రధాన అర్చకులు పీఎన్ మహేశ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ప్రధాన అర్చకుడు కె. జయరామన్ నంబూతిరి బంధువు మృతి కారణంగా పూజలకు హాజరుకావడం లేదు.
ప్రత్యేక ఆకర్షణ ఇదే...
ఈసారి ఆలయ ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసిన రాతి స్తంభాలు భక్తుల మనసు దోచుకోనున్నాయి. నిర్మాణంలో ఉన్న హైడ్రాలిక్ పైకప్పులో స్తంభాలు ఒక భాగం. హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్రం అనే నిర్మాణ సంస్థ ఆయప్ప స్వామికి కానుకగా పైకప్పును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ దాదాపు రూ.70 లక్షలు కేటాయించినట్లు మీడియా సమచారం. 'పదినెట్టం పడి'కి ఇరువైపులా ఏర్పాటు చేసిన స్తంభాలలో 'స్వామియే శరణం అయ్యప్ప' అనే అక్షరాలతో అందమైన చెక్కడాలు, తిరిగే చక్రాలు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ
వర్షం లేని సమయాల్లో రూఫ్ కు ఇరువైపులా మడతపెట్టేలా ఉండే హైడ్రాలిక్ రూఫ్‌ను చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న క్యాపిటల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ రూపొందించింది. 'పతినెట్టం పడి' పైకప్పుగా దీన్ని ఏర్పాటు చేయడం వల్ల.. 'పడి పూజ' ఆచారం (18 పవిత్ర మెట్లకు ప్రార్థనలు) సమయంలో వర్షాలు ఇబ్బంది కలిగించవు. ప్రస్తుతం, 'పడి పూజ' సమయంలో మెట్లపై టార్పాలిన్ షీట్ ను వేస్తున్నారు.
భద్రతగా 13,000 మంది పోలీసులు
60 రోజుల పాటు జరిగే మండల తీర్థయాత్ర డిసెంబర్ 27న ముగుస్తుంది. డిసెంబర్ 30న మకరవిళక్కు ఉత్సవాల కోసం ఆలయం తిరిగి తెరవబడుతుంది. జనవరి 15న జరిగే వార్షిక మకరవిళక్కు ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భద్రత కోసం 13,000 మంది పోలీసు అధికారులను మోహరించాలే చర్యలు తీసుకుంటున్నారు. శబరిమల ఆలయంలో తీర్థయాత్ర సీజన్‌లో భక్తుల రద్దీని నియంత్రించడానికి ఆరు దశల్లో 13,000 మంది పోలీసులను మోహరించినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ షేక్ దర్వేష్ సాహిబ్ ప్రకటించారు.
చిన్నారులు, వృద్ధులు దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. యాత్రికులను రవాణా చేసే వాహనాలు అలంకరణలు లేదా అనధికార అమరికలను ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సన్నిధానం, నిలక్కల్, వడస్సెరిక్కరలో తాత్కాలిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
పంపా వద్ద KSRTC డిపో
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)యాత్ర సీజన్‌కు ముందు పంపా వద్ద డిపోను ప్రారంభించింది. మొదటి దశలో చైన్ సర్వీసుగా పంపా నుంచి నిలక్కల్ వరకు సర్వీసుల నిర్వహణకు కేటాయించిన 120 బస్సుల్లో రెండు వందలు బుధవారం మధ్యాహ్నానికి డిపోకు చేరుకున్నాయి. ప్రత్యేక బస్సుల టిక్కెట్ ధరలు పెంచాయి. తిరువనంతపురం, కొట్టారక్కర, పందళం, ఎరుమేలి డిపోల నుండి పంబాకు షెడ్యూల్డ్ ట్రిప్పులుగా రోజువారీ సర్వీసులను నడుపుతున్న అన్ని బస్సులను ప్రత్యేక సర్వీసులుగా మార్చారు.