Maharashtra: భార్య వివాహేతర సంబంధం.. సోదరుడిని చంపిన భర్త.. అసలేం జరిగింది?

By Mahesh K  |  First Published Nov 16, 2023, 10:31 PM IST

మహారాష్ట్రలో ఓ వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో సోదరుడిని చంపేశాడు. పలుమార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన లాతూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
 


ముంబయి: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుకున్నాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంది తన కజిన్ బ్రదర్ అని అనుమానం పెంచుకున్నాడు. ఓ రోజు తన సోదరుడిని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన లాతూర్ జిల్లా శిందల్వాడీ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

బాలాజీ సుభాశ్ రాథోడ్.. తన సోదరుడైన 28 ఏళ్ల ప్రదీప్ పాపా రాథోడ్‌ను కత్తితో పలుమార్లు పొడిచేశాడు. దీంతో ప్రదీప్ పాపా రాథోడ్ స్పాట్‌లోనే కుప్పకూలిపోయి మరణించాడు. ప్రదీప్ పాపా రాథోడ్‌ను పొడిచి చంపడానికి బాలాజీ సుభాశ్ రాథోడ్ మరో మిత్రుడిని వెంట తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇద్దరూ పరారీలో ఉన్నారు.

Latest Videos

Also Read: CPM : సంగారెడ్డిలో ఆసక్తికర పరిణామం.. సీపీఎం మద్దతు కోరిన మంత్రి హరీశ్ రావు

సోదరుడైన ప్రదీప్ పాపా రాథోడ్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాలాజీ సుభాశ్ రాథోడ్ అనుమానించాడు. అందుకే ప్రదీప్ పాపా రాథోడ్‌ను చంపినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

click me!