
శబరిమల అయ్యప్పను మహిళలు దర్శించుకోవడాన్ని నిరసిస్తూ.. కేరళలలో ఆందోళన కారులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు 1800మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. అయినప్పటికీ.. ఆందోళనలు మాత్రం ఆగడం లేదు.
ఈ ఆందోళనలో భాగంగా.. ఒక ఎమ్మెల్యే,, ఒక ఎంపీల ఇళ్లపై దాడులు జరిగాయి. కన్నూర్ లోని ఇరిత్తి ప్రాంతంలో సీసీఎం పార్టీకి చెందిన కార్యకర్తపై శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఆందోళన కారులు దాడి చేశారు. కత్తితో దారుణంగా పొడిచారు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఇదిలా ఉండగా.. స్థానిక ఎమ్మెల్యే ఏఎన్ షంహీర్ ఇంటిపై, తలస్సెరీ ప్రాంతంలో బీజేపీ ఎంపీ మురళీధరన్ ఇంటిపై ఆందోళనకారులు బాంబులు విసిరారు.
అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం కలగపోవడం గమనార్హం. శనివారం ఉదయం ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు అంటారు. పలు చోట్ల ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి.