బెంగళూరు జైల్లో శశికళతో విజయశాంతి ములాఖత్...అందుకోసమేనా?

By Arun Kumar PFirst Published Jan 5, 2019, 9:12 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ ఘోరంగా ఓడించిన విషయం తెలిసింతే. తమ ఓటమికి కారణమైన టీఆర్ఎస్ పార్టీపై, అధినేత కేసీఆర్ రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో ఎలాగూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏం చేయలేమని భావించి...జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రకటించిన పెడరల్ ప్రంట్ ఏర్పాట్లను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎంపి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నాడిఎంకే బహిషృత  నాయకురాలు శశికళతో బెంగళూరు జైల్లో ములాఖత్ అయ్యారు.
 
ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య కేసిఆర్ పెడరల్ ప్రంట్ పై చర్చ జరిగినట్లు సమాచారం. విజయ శాంతితో శశికళ పెడరల్ ప్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జాతీయ స్ధాయిలో అన్నాడీఎంకే పార్టీ బిజెపికి సపోర్ట్ చేయనున్నారు కాబట్టి మీరు కాంగ్రెస్ కూటమికి (ప్రతిపక్షాల)  మద్దతివ్వాలని శశికళకు విజయశాంతి కోరినట్లు సమాచారం.

ముఖ్యంగా శశికళ స్థాపించిన 'అమ్మ మక్కళ్‌ మున్నేట్ర కళగం పార్టీ' మద్దతు కోరడానికి కాంగ్రెస్ పార్టీ విజయశాంతితో శశికళకు రాయబార పంపించారు. ఇప్పటికే తమిళనాడు లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. దీంతో తమిళ నాడులో మరింత బలాన్ని పెంచుకోడానికే శశికళను కలుపుకుపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 

 ములాఖత్ లో భాగంగా శశికళను కలవడానికి విజయశాంతి వచ్చినమాటే నిజమేనని జైలు అధికారులు తెలిపారు. వీరిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నట్లు తెలిపారు. నిబంధనల  ప్రకారమే ములాఖత్ కు అనుమతిచ్చినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 

click me!