శబరిమల వివాదం..మోదీ కేరళ పర్యటన వాయిదా

By ramya neerukondaFirst Published Jan 5, 2019, 9:32 AM IST
Highlights

శబరిమలలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటన వాయిదా పడింది.

శబరిమలలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటన వాయిదా పడింది. జనవరి 6వ తేదీన ప్రధాని మోదీ పతనంతిట్టను సందర్శించాల్సి ఉంది. అక్కడ ప్రస్తుతం ఘర్షణ వాతావరణ నెలకొని ఉండటంతో ఆయన పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై శబరిమల రెండురోజులుగా రణరంగాన్ని తలపిస్తోంది. మహిళలు ఆలయంలోకి ప్రవేశించటాన్ని సుప్రీం కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే. మహిళల ఆలయ ప్రవేశంపై శబరిమల ఇంకా రగులుతూనే ఉంది.

శుక్రవారం చెలరేగిన తీవ్రస్థాయి హింసాకాండకు సంబంధించి ఇప్పటికీ 1400 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ప్రధాని మోదీ కేరళ పర్యటన రద్దయిందని బీజేపీ నేతలు వెల్లడించారు. అల్లరిమూకలను అణచివేసేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నట్టు, ఇందులో భా గంగానే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ ఈ ఏడాది తొలిసారిగా కేరళలో బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. మరో వైపు రాష్ట్రంలో అనేకప్రాంతాలలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

click me!