రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఓ రష్యన్ మహిళ సహాయం చేశారు. బాలీవుడ్ హీరోలను, సినిమాలను గుర్తు చేస్తూ సరదాగా కబుర్లు చెప్పారు.
ఢిల్లీ : మంగళవారం సాంకేతిక సమస్య కారణంగా ఎయిర్ ఇండియా విమానం రష్యలోని మారుమూల పట్టణంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. రష్యాలోని మగడాన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణీకులు, సిబ్బందితో కూడిన ప్రత్యామ్నాయ విమానం బయలుదేరింది.
undefined
ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంగళవారం మగడాన్‌కు మళ్లించారు. 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న బోయింగ్ 777 విమానం మగడాన్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులు మరియు సిబ్బందిని రిమోట్ రష్యన్ పట్టణంలో తాత్కాలిక వసతి గృహాలలో ఉంచారు.
పిల్లలు, వృద్ధులతో సహా ప్రయాణీకులు భాషా అవరోధాలు, వారిది కాని ఆహారం, నాసిరకం వసతులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ప్రయాణికులకు ఓ రష్యన్ మహిళ సహాయం చేసింది. ఆమె వారితో కలిసి మాట్లాడుతూ.. ఇండో రష్యన్ స్నేహం గురించి, బాలీవుడ్ సినిమాల గురించి చెప్పుకొచ్చింది. మిథున్ చక్రవర్తి, రామ్ కపూర్ లాంటి హీరోలను గుర్తు చేసుకుంది. వారి నటన తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది.
భారతీయులు ఎంతో ప్రీతికరమైన వారంటూ తెలిపింది. తనకు ఇండియా అంటే చాలాఇష్టమని తెలిపింది. ఓ బాలీవుడ్ పాటను కూడా హమ్ చేసింది. మనది కాని దేశంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చి.. జిమ్మి.. జిమ్మి.. ఆజా.. ఆజా పాటను గుర్తు చేశారు.