Russia Ukraine Crisis : సుమీ నుంచి బ‌య‌లుదేరిన 694 మంది విద్యార్థులు.. ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

Published : Mar 09, 2022, 08:42 AM IST
Russia Ukraine Crisis : సుమీ నుంచి బ‌య‌లుదేరిన 694 మంది విద్యార్థులు.. ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

సారాంశం

రష్యా భీకరంగా దాడులు చేస్తున్న సుమీలో పలువురు భారతీయులు చిక్కుకున్నారు. అయితే అక్కడ ఉన్న 694 మంది భారతీయుల తరలింపు ప్రారంభమైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమీ నుంచి పోల్టావా కు బస్సులో విద్యార్థులు బయలుదేరారు. వారు పోల్టావా నుంచి ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దుకు చేరుకుంటారు. 

ఉక్రెయిన్ (Ukraine)కు, ర‌ష్యా (Russia)కు మ‌ధ్య వార్ (war)ఆగ‌డం లేదు. రెండు దేశాల మ‌ధ్య రోజు రోజుకు ఉద్రిక్త ప‌రిస్థితులు ఎక్కువ‌వుతున్నాయి. ఈ యుద్ధం వ‌ల్ల ఉక్రెయిన్ పౌరుల‌తో పాటు అమాయ‌కులైన వివిధ దేశాల పౌరుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటు ఉక్రెయిన్ సైన్యం, అటు ర‌ష్యా సైన్యం కూడా త‌న సైనికుల‌ను కోల్పొతోంది. ర‌ష్యా ఇప్ప‌టికే త‌న ఇద్ద‌రు మేజ‌ర్ జ‌న‌ర‌ల్ (russia general)ల‌ను కోల్పొయింది. యుద్ధం ఆపేందుకు ప్ర‌పంచ దేశాలు కృషి చేస్తున్నప్ప‌టికీ అవేవీ ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం లేదు. ఇటీవ‌లే ర‌ష్యాకు, ఉక్రెయిన్ కు మ‌ధ్య మూడో ద‌శ శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ అవి విఫ‌ల‌మయ్యాయి. అయితే సాధార‌ణ పౌరుల‌కు ఎలాంటి హానీ క‌లిగకుండా, వారిని త‌లించేందుకు వీలుగా కాల్పుల విర‌మ‌ణ‌ను ర‌ష్యా ప్ర‌క‌టించింది. ఈ విర‌మ‌ణ మంగ‌ళ‌వారం 10 గంటల నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. 

ర‌ష్యా కాల్పుల విర‌మ‌ణ‌ను ప్ర‌క‌టించ‌డంతో వివిధ దేశాలు త‌మ పౌరుల‌ను త‌ర‌లించేందుకు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు కొన‌సాగించాయి. ఇందులో భాగంగానే త‌న ప్ర‌య‌త్నాలను వేగ‌వంతం చేసింది. ఉక్రెయిన్ లోని సుమీ (Sumy)లో చిక్కుకున్న మొత్తం 694 మంది భారతీయ విద్యార్థుల తరలింపు ను ప్రారంభించింది. వారంతా సుమీ నుంచి బ‌స్సుల్లో పోల్తావాకు బయలుదేరు. దీనిని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh puri) ధృవీక‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నిన్న రాత్రి నేను కంట్రోల్ రూమ్‌తో తనిఖీ చేసాను. 694 మంది భారతీయ విద్యార్థులు సుమీలో ఉన్నారు. ఈ రోజు వారందరూ పోల్టావా (Poltava) కు వెళ్లేందుకు బస్సుల్లో బయలుదేరారు ’’ అని చెప్పారు.

సుమీ యూనివ‌ర్సిటీకి చెందిన ఓ స్టూడెంట్ పీటీఐతో మాట్లాడుతూ.. తాము పోవాల్తాకు వెళ్తున్నామ‌ని తెలిపారు. ఉద్రిక్త ప్రాంతం నుంచి సేఫ్ జోన్ కు బ‌స్సుల్లో బ‌య‌లుదేరామ‌ని పేర్కొన్నారు. కాగా పోల్టావా నుండి ఉక్రెయిన్‌లోని ప‌శ్చిమ స‌రిహ‌ద్దుకు రైళ్లలో బ‌య‌లుదేరుతార‌ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ‘‘ఉక్రెయిన్  రాజ‌ధాని కైవ్ స‌మీపంలోని సుమీ, ఇర్ఫిన్ ప‌ట్ట‌ణం నుంచి పౌరులను గ్రీన్ కారిడార్ ద్వారా పోల్టోవా న‌గ‌రానికి త‌ర‌లిస్తున్నాం. ఉక్రెయిన్ లోని ఇత‌ర మాన‌వ‌తా కారిడార్ ల‌ను అంగీక‌రించాల‌ని ర‌ష్యాను కోరుతున్నాం’’ అని పేర్కొంది. అనంతరం సుమీ నుంచి పౌరుల త‌ర‌లింపున‌కు సంబంధించిన ఒక వీడియోను ట్వీట్ చేసింది. 

సుమీ ప‌ట్ట‌ణం రష్యా సరిహద్దుకు సమీపంలో, ఉక్రేనియన్ రాజధాని కైవ్‌కు తూర్పున 350 కిమీ దూరంలో ఉంది. ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్ర మొద‌లు పెట్టిన స‌మ‌యంలో ఈ న‌గ‌రంలో భారీ విధ్వంసం జరిగింది. ఈ సుమీలో జ‌రిగిన వైమానిక దాడిలో ఇద్ద‌రు చిన్న‌పిల్లలతో పాటు తొమ్మిది మంది మ‌ర‌ణించారు. ఈ న‌గ‌రంపై కాల్పులు జ‌రుగుతుండ‌టంతో వివిధ దేశాల పౌరులు అక్క‌డే చిక్కుకుపోయారు. త‌మ‌ని త‌ర‌లిస్తార‌ని రోజుల త‌ర‌బ‌డి ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోల‌ను కూడా విడుద‌ల చేశారు. ఎట్ట‌కేల‌కు వారిని ఇండియాకు తీసుకువస్తున్నారు. కాగా.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భార‌తీయుల‌ను త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేషన్ గంగా పేరిట ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 83 విమానాల ద్వారా 17,100 మంది భారతీయులను దేశానికి తీసుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !