శ్రీలంక సంక్షోభానికి రష్యానే కార‌ణం - ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ

Published : Jul 14, 2022, 11:31 AM IST
శ్రీలంక సంక్షోభానికి రష్యానే కార‌ణం - ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ

సారాంశం

ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి రష్యానే కారణం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ అన్నారు. సియోల్‌లో బుధవారం జరిగిన ఆసియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 

శ్రీలంక సంక్షోభానికి ర‌ష్యానే కార‌ణ‌మ‌ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ పై దాడి స‌మ‌యంలో ఆహార ఉత్పత్తులను నిరోధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అశాంతి ఏర్పడిందని ఆయన ఎత్తి చూపారు. బుధవారం సియోల్‌లో జరిగిన ఆసియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై దాడి చేయడంలో రష్యా ఉపయోగించిన వ్యూహాలలో ఎక‌నామిక్ షాక్ సృష్టించ‌డం ఒకటి అని అన్నారు. 

మహిళను రెండు రోజులు హోటల్ గదిలో బంధించి, అత్యాచారయత్నం.. పోలీస్ వ్యాన్ కనిపించడంతో...

సప్ల‌య్ చైన్ లో సంక్షోభం, అంతరాయం కారణంగా అనేక దేశాలు ఆహారం, ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇవి రష్యా ఎజెండాకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయని ఆయన అన్నారు. “ ఈ ఎక‌నామిక్ షాకింగ్.. ఫుడ్, ఇంధన ధరల పెరుగుదల సామాజిక విస్ఫోటనానికి దారితీసింది. ఇది ఎలా ముగుస్తుందో ఇప్పుడు ఎవరికీ తెలియదు ” అని శ్రీలంకలో సంక్షోభాన్ని ప్ర‌స్తావిస్తూ జెలెన్స్కీ వ్యాఖ్య‌లు చేశారు. 

1948లో బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందినప్పటి శ్రీలంక.. ప్ర‌స్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, ఇది ఆహారం, ఔషధం, వంట గ్యాస్, ఇంధనం, టాయిలెట్ పేపర్ వంటి ముఖ్యమైన వస్తువుల కొరతకు దారితీసింది, శ్రీలంక ప్రజలు ఇంధ‌నం, వంట గ్యాస్ కొనుగోలు చేసేందుకు గంటల తరబడి దుకాణాల ఎదుట లైన్లలో వేచి ఉండవలసి వచ్చింది. 

స్నేహితుడిని చంపేసి.. చచ్చిన పామును పక్కనవేసి...

ఇదిలా ఉండగా ఆహార ధరలు పెరగడం, మిలియన్ల మంది ఆకలికి కార‌ణ‌మైన ధాన్యం ఎగుమతులపై ప్రతిష్టంభనను తొలగించ‌డానికి రష్యా, ఉక్రెయిన్ బుధవారం మొద‌టి ప్రత్యక్ష చర్చలను నిర్వహించాయి. రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ మధ్య తాజా ఒప్పందం వ‌ల్ల నల్ల సముద్రం ద్వారా ధాన్యం పంపిణీ సుల‌భం అవుతుంది. ఉక్రేనియ‌న్ ఉత్ప‌త్తుల‌ సురక్షితమైన ఎగుమతిని నిర్ధారించడంలో ఇది కీలకమైన ముందడుగు అని UN సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ ఒక ప్రకటనలో తెలిపారు. 

కదిలేదే లేదు... కనీసం మా పిల్లలకైనా ఒక సమర్థ, సుస్థిర దేశం కావాలి : శ్రీలంక నిరసనకారులతో గ్రౌండ్ జీరో నుంచి

‘‘ సంక్షోభాలతో చీకటిగా ఉన్న ప్రపంచంలో చివరికి ఈ రోజు మనకు ఆశా కిరణం కనిపించింది. మానవ బాధలను తగ్గించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఆకలిని తగ్గించడానికి ఇది ఒక గొప్ప ప‌రిణామం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, అత్యంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాల‌కు ఇది ఒక ఆశా కిర‌ణం. గ్లోబల్ ఫుడ్ సిస్టమ్‌కు చాలా అవసరమైన స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఇది దోహద‌ప‌డుతుంది ” అని న్యూయార్క్‌లోని యూఎన్ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ సంస్థ చీఫ్  మీడియా ప్ర‌తినిధుల‌తో అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌