Sabarimala temple: భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల ఆలయంలో దర్శన సమయాలను గంటపాటు పెంచుతూ టీడీబీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సమయాలను బోర్డు సవరించింది.
Ayyappa Swamy Devotees: శబరిమల ఆలయం వద్ద భారీ రద్దీ కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ఉన్నత స్థాయి మంత్రుల బృందాన్ని పంబాకు పంపాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది. మంత్రులు పంబకు వెళ్లి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలన్నారు. రద్దీని నియంత్రించడంతో పాటు భక్తులకు మౌళిక సదుపాయాలు కల్పించడానికి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సూచించారు. ప్రభుత్వం, ఆలయాన్ని పాలిస్తున్న ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైతే ఆందోళన చేపడతామని బీజేపీ హెచ్చరించింది.
Heavy crowd in pampa. சபரிமலை பம்பாவில் வரலாறு காணாத பக்தர்கள் கூட்டம்.. சாமிமார்கள் பல மணி நேரம் காத்திருப்பு.. பக்தர்கள் தவிப்பு. pic.twitter.com/Reivm77TMD
— K.S.Raja (@ksrajabe)
undefined
ప్రస్తుతం అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అయితే, ''గత కొన్ని రోజులుగా శబరిమల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులకు నీరు కూడా దొరకడం లేదు. ప్రభుత్వం ఈ సమస్యను ఇంత పేలవంగా నిర్వహిస్తే, మా పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు వెళ్ళక తప్పదు" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ హెచ్చరించారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆలయంలో రద్దీని నియంత్రించడానికి పోలీసులు, అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని దేవదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు.
రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వస్తుంటారనీ, గరిష్ఠంగా 80 వేల మందికి మాత్రమే వసతి కల్పిస్తున్నామన్నారు. నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి ఎక్కుతున్నారు. యాత్రికులను వెంబడించి పట్టుకోలేమనీ, కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దనీ, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికార యంత్రాంగానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల ఆలయంలో దర్శన సమయాలను గంటపాటు పెంచుతూ టీడీబీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఇదివరకు మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉండగా, ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సమయాలను బోర్డు సవరించింది. అలాగే, క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు నీరు, బిస్కెట్లు అందిస్తున్నారు.