మహిళతో అసభ్యకర స్ధితిలో ఓ వ్యక్తి, అయోధ్య రామ మందిర పూజారి అంటూ ఫేక్ వీడియో .. గుజరాత్ కాంగ్రెస్ నేత అరెస్ట్

By Siva Kodati  |  First Published Dec 12, 2023, 4:33 PM IST

ఇటీవల అయోధ్యలోని శ్రీరామ మందిరంలో ప్రధాన అర్చకుడిగా నియమితులైన మోహిత్ పాండేపై సోషల్ మీడియాలో అభ్యంతరకర చిత్రాలను ప్రసారం చేసిన నేరంపై గుజరాత్ పోలీసులు కాంగ్రెస్ నేత హితేంద్ర పితాదియాను అరెస్టు చేశారు.


అయోధ్య రామ మందిర పూజారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను గుజరాత్ కాంగ్రెస్ నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అయోధ్యలోని శ్రీరామ మందిరంలో ప్రధాన అర్చకుడిగా నియమితులైన మోహిత్ పాండేపై సోషల్ మీడియాలో అభ్యంతరకర చిత్రాలను ప్రసారం చేసిన నేరంపై గుజరాత్ పోలీసులు కాంగ్రెస్ నేత హితేంద్ర పితాదియాను అరెస్టు చేశారు.

 

Latest Videos

 

అయోధ్య రామ మందిరానికి పూజారిగా మారడానికి సిద్ధమైన వ్యక్తి ఇతనేనా?” అనే క్యాప్షన్‌తో పాటు ‘అసభ్యకరమైన’, ‘నకిలీ’ ఫోటోలను వీడియోలను హితేంద్ర షేర్ చేశారు. ఇందులో ఒక వ్యక్తి నుదిటిపై తిలకం (మత చిహ్నం) ధరించి, గంధపు చెక్కతో ఓ మహిళలతో అత్యంత సన్నిహితంగా వున్నాడు. మరొక ఫోటో ఈ ఇద్దరు వ్యక్తులు సరస సల్లాపాల్లో మునిగి తేలినట్లుగా వుంది. 

ఈ నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్‌లో ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌గా ఉన్న హితేంద్ర పితియాపై సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదు నమోదు చేసింది. తప్పుడు పోస్టులు సృష్టించి ప్రచారం చేసినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు, వ్యక్తుల పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ విభాగం సత్వర చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసింది. పితియాపై IPC 469, 509, IPC 295A , IT చట్టం కింద కేసు నమోదు చేయబడింది.

 

1418
ANALYSIS: Misleading

FACT: An obscene Image of a couple has been shared claiming to be of Mohit Pandey, who was recently selected as a priest in Ram Mandir Ayodhya. Upon research, we found that video on various porn website that features the same couple. (1/3) pic.twitter.com/qEOv41TmAz

— D-Intent Data (@dintentdata)

 

నివేదికల ప్రకారం ఓ మహిళ, పురుషుడు అత్యంత సన్నిహితంగా వున్న వీడియోలు అశ్లీల వెబ్‌సైట్‌లో కనుగొన్నారు పోలీసులు. ఈ సందేహాస్పద వీడియోలో తెలుగు పూజారి ఒకరు ఉన్నారు . దీనికి  మోహిత్ పాండేతో ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మోహిత్ పాండే కాదని దర్యాప్తులో తేలింది. 

మోహిత్ పాండే ఎవరు :

దూధేశ్వర్ నాథ్ వేద్ విద్యా పీఠ్ విద్యార్థి మోహిత్ పాండే అయోధ్యలోని శ్రీరామ మందిరంలో ప్రధాన పూజారిగా నియమితులయ్యారు. పూజారి పోస్ట్ కోసం జరిగిన సుమారు 3000 ఇంటర్వ్యూల నుండి, మోహిత్‌తో సహా 20 మంది వ్యక్తులు ఎంపికయ్యారు. ఎంపికైన అర్చకులందరూ తమ బాధ్యతలను స్వీకరించడానికి ముందు ఆరు నెలల శిక్షణ పొందుతారు.

అసభ్యకరమైన చిత్రాలలో చిత్రీకరించబడిన వ్యక్తి మోహిత్ పాండేనే అని ప్రచారం చేయడంతో పాటు ఓ అశ్లీల వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాలను , వీడియోలని షేర్ చేసిన కాంగ్రెస్ నేత బుక్ అయ్యారు. 

click me!