ఆ కిట్ లో రబ్బరు పురుషాంగం.. షాకైన గ్రామస్థులు..!

Published : Mar 24, 2022, 10:34 AM IST
 ఆ కిట్ లో రబ్బరు పురుషాంగం.. షాకైన గ్రామస్థులు..!

సారాంశం

మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే పంచి పెట్టింది. అయితే... అలా పంచిపెట్టిన కిట్ లో.. రబ్బరు పురుషాంగం కూడా ఉండటం గమనార్హం. ఆశావర్కర్లతో సహా...  గ్రామస్థులు కూడా షాకయ్యారు.

కుటుంబ నియంత్రణ విషయంలో దేశంలో.. ప్రభుత్వం అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం చాలా సర్వ సాధారణం. ఈ క్రమంలో... గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఆశావర్కర్ల సహాయంతో.. కుటుంబ నియంత్రణ కిట్స్ ని కూడా పంచిపెడుతూ ఉంటారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే పంచి పెట్టింది. అయితే... అలా పంచిపెట్టిన కిట్ లో.. రబ్బరు పురుషాంగం కూడా ఉండటం గమనార్హం. ఆశావర్కర్లతో సహా...  గ్రామస్థులు కూడా షాకయ్యారు.

రబ్బరు గర్భాశయం, పురుషాంగం కిట్‌లో ఉంచడం పట్ల ఆశా కార్యకర్తలు విస్మయం చెందారు. ఇప్పటి వరకూ కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కరపత్రాలు, చిత్రాలతో కూడిన బుక్‌లెట్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ, ప్రస్తుతం మొదటిసారి కిట్‌లో రబ్బరు పురుషాంగం, గర్భాశయం, కండోమ్‌లను ఉంచింది.

వీటి సాయంతో కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారికి దీనిపై కౌన్సిలింగ్ ఇస్తారు. ఉత్తమ గర్భనిరోధక పద్దతుల్లో ఒకటైన కండోమ్ వాడకం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో రబ్బరు పురుషాంగాన్ని ఉంచినట్టు తెలుస్తోంది.

అభ్యంతరకర వస్తువులను కిట్​ లో ఉంచడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్​ సందర్భంగా తాము వాటిని ఉపయోగించి కుటుంబ నియంత్రణ పద్ధతులను ఇలాంటి కిట్లు ఇవ్వడమేంటని భాజపా శాసన సభ్యురాలు చిత్రా వాగ్​ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో రాష్ట్ర మంత్రి రాజేంద్ర శింగా విచారణకు ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu