పరువు నష్టం దావా: ముంబై కోర్టుకు రాహుల్ గాందీ

By narsimha lodeFirst Published Jul 4, 2019, 11:18 AM IST
Highlights

పరువునష్టం కేసులో ముంబై స్థానిక కోర్టుకు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం నాడు ఉదయం హాజరయ్యారు. 
 

ముంబై: పరువునష్టం కేసులో ముంబై స్థానిక కోర్టుకు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం నాడు ఉదయం హాజరయ్యారు. 

జర్నలిస్ట్ గౌరి లంకేష్  హత్య విషయంలో ఆర్ఎస్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త  పరువు నష్టం దావా దాఖలు చేశారు.

ఈ విషయమై మేజగోన్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో రాహుల్ గాంధీతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సమన్లు పంపింది.లాయర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త ధరుతిమాన్ జోషి పరువునష్టం దావా వేశాడు. 

2017లో జోషి రాహుల్ గాంధీతో పాటు సీతారాం ఏచూరిపై కేసు వేశాడు. 2017 సెప్టెంబర్ మాసంలో బెంగుళూరులో గౌరీ లంకేష్ తన ఇంటి వద్దే హత్యకు గురయ్యారు.   రైట్ వింగ్ గ్రూప్‌కు చెందిన కార్యకర్తలు ఈ దాడి చేశారని విమర్శించారు.

గౌరీ లంకేష్ హత్యకు గురైన విషయమై అప్పట్లో రాహుల్ స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా  మాట్లాడితే బెదిరింపులు, కొట్టడం లేదా ఇలా చంపేస్తున్నారరి వ్యాఖ్యానించారు. 

ఆర్ఎస్ఎస్ కు చెందిన వాళ్లే ఈ దాడి చేశారని ఆమె సీతారాం ఏచూరి ఆరోపించారు. ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలపై జోషి పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విషయమై రాహుల్ గురువారం నాడు ముంబై కోర్టు ఎదుట హాజరయ్యారు.ఇదిలా ఉంటే ఈ కేసులో రాహుల్ గాంధీ కోర్టు బెయిల్ మంజూరు చేశారు.

 

click me!