ఈ ధైర్యం కొందరికే ఉంటుంది... రాహుల్ పై ప్రియాంక కామెంట్స్

By telugu teamFirst Published Jul 4, 2019, 10:03 AM IST
Highlights

రాహుల్ గాంధీ ధైర్యాన్ని అతని సోదరి ప్రియాంక గాంధీ మెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

రాహుల్ గాంధీ ధైర్యాన్ని అతని సోదరి ప్రియాంక గాంధీ మెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై తాజాగా ప్రియాంక గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన సోదరుడి ధైర్యాన్ని ఆమె మెచ్చుకున్నారు. 

రాహుల్ నిర్ణ‌యాన్ని ఆమె సమర్థించారు. రాహుల్ నిర్ణయాన్నిన తాను గౌర‌విస్తున్న‌ట్లు చెప్పారు. రాహుల్ లాగా ధైర్యం చాలా కొద్ది మంది మాత్రమే చూపించగలరంటూ కితాబు ఇచ్చారు.  ఈ మేరకు ట్వీట్ చేసిన ప్రియాంక... రాజీనామా నిర్ణయం తీసుకుంటూ రాహుల్ చేసిన ట్వీట్ ని కూడా రీట్వీట్ చేశారు. 

 పార్టీ భవిష్యత్ బాగుండాలంటే జవాబుదారీతనం ముఖ్యమని, తన నిర్ణయా న్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని రాహుల్ నిన్న ట్విట్ట‌ర్‌లో రిలీజ్ చేసిన లేఖ‌లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) వెంటనే పార్టీ అధ్యక్షుడిగా వేరొకరిని ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. 

ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మే 27న జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖను అందించారు. సీడబ్ల్యూసీ ఆ లేఖను తిరస్కరించినా. నాటి నుంచి హై డ్రామా కొనసాగుతున్నది. ఆయన్ను బుజ్జగిం చేందుకు పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆయన కొనసాగాలంటూ పార్టీ కార్యకర్తల ధర్నాలు, నేతల మూకుమ్మడి రాజీనామాలూ కొనసాగినా రాహుల్‌గాంధీ వెనక్కి తగ్గలేదు. బుధవారం తన రాజీనామా లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
 

click me!