'భారత్‌లో ఇస్లాం సేఫ్.. కానీ, వారు విదేశీ సంబంధాలను మరచిపోవాలి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సంచలన ప్రకటన

By Rajesh KarampooriFirst Published Jun 2, 2023, 1:29 AM IST
Highlights

సరిహద్దులపై దుష్ప్రచారం చేసే శత్రువులకు బలం చూపడానికి బదులు మన మధ్య మనం పోరాడుతున్నామని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశంలో కులం, మతం, భాష విషయంలో రకరకాల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. భారతదేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు.

విదేశీ శక్తులు మనల్ని విభజించాలని, మనపైనా వారు అధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయని, అయితే వారిని ఎట్టి పరిస్థితిలోనూ గెలవనివ్వకూడదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన వార్షిక శిక్షణా కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. భారత్'లో ఇస్లాం,దాని ఆరాధకులు చాలా సురక్షితంగా ఉన్నారని అన్నారు. స్పెయిన్ నుండి మంగోలియా వరకు  పలు ఇస్లాం దేశాల్లో మతపరమైన దాడులు జరుగుతున్నాయనీ, అయితే ఈ దేశాల్లోని ప్రజలు మేల్కొనడంతో వెనక్కి తగ్గవలసి వచ్చిందని భగవత్ అన్నారు. 

దేశ ప్రయోజనాల దృష్ట్యా విదేశీ సంబంధాలను మరచిపోయి భారతీయ సంస్కృతితో కలిసిపోవాలని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. మన దేశంలో అలాంటి చర్యలకు తావులేదనీ, యూదులు లేదా పార్సీలు వంటి వర్గాలు కూడా భారత్ ఆశ్రయమిచ్చిందని, నేడు వారందరూ సురక్షితంగా ఉన్నారని, ప్రస్తుతం మనమందరం ఈ దేశానికి చెందినవాళ్లమేననీ, ఇతరులు ఎట్టీ పరిస్థితుల్లో సంకోచపడ్డాల్సిన అవసరం లేదన్నారు. మనమందరం చిన్న చిన్న గుర్తింపు సమస్యలను విడిచిపెట్టాలనీ, అందరం భారతీయులుగానే  ఉండాలని అన్నారు. 

సరిహద్దులపై దుష్ప్రచారం చేసే శత్రువులకు బలం చూపడానికి బదులు మన మధ్య మనం పోరాడుతున్నామని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో భాష, మత,కుల విషయంలో రకరకాల వివాదాలు చోటుచేసుకుంటున్నాయనీ, భారతదేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. దేశంలో కుల వివక్ష ఎక్కువగా ఉందని, కులంపై అన్యాయం జరుగుతోందని భగవత్ అన్నారు. దాని ఉనికిపై ఎలాంటి తిరస్కరణ ఉండకూడదని ఆయన అన్నారు. 
 
కొత్త పార్లమెంట్ గురించి మోహన్ భగవత్ ఏమన్నారు?

కొత్త పార్లమెంటు భవనం గురించి మోహన్ భగవత్ మాట్లాడుతూ.. పార్లమెంటులో ఉంచిన చిత్రాల వీడియోలు వైరల్ అవుతున్నాయని భగవత్ అన్నారు. వీళ్లను చూస్తే గర్వంగా అనిపించినా దేశంలో ఆందోళన కలిగించే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. దేశంలో భాష, శాఖ, సౌకర్యాల విషయంలో రకరకాల వివాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. మనం వేరుగా కనిపించడం వల్ల మనం వేరు అనే ఆలోచనతో దేశం విడిపోదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.ఇది మన మాతృభూమి అని అన్నారు.  

 రాహుల్ గాంధీపై టార్గెట్ 

సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. భారతదేశాన్ని కించపరిచే శత్రువులు దేశం వెలుపల ఉన్నారని అన్నారు. నిజానికి, రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. బిజెపిని లక్ష్యంగా చేసుకుంటూ బిజెపి ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.

click me!