17 ఏళ్ల బాలికకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడేందుకు ఒక్కటైన కేరళ .. ఏం జరిగింది, ఎవరామె..?

By Siva KodatiFirst Published Jun 1, 2023, 8:21 PM IST
Highlights

కేరళలోని కట్టప్పన చర్చిలో గుండెపోటుకు గురైన 17 ఏళ్ల ఆన్ మారియా ప్రాణాలను కాపాడేందుకు ఆ రాష్ట్రం ఒక్కటైంది. ఆటో రిక్షా డ్రైవర్లు, స్థానికులు రోడ్లను క్లియర్ చేసి అంబులెన్స్‌కు రూట్‌ను ఏర్పాటు చేశారు.

కేరళలోని కట్టప్పన చర్చిలో గుండెపోటుకు గురైన 17 ఏళ్ల ఆన్ మారియా ప్రాణాలను కాపాడేందుకు ఆ రాష్ట్రం ఒక్కటైంది. తొలుత ఆమెను ఇడుక్కిలోని కట్టప్పనాలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను అంబులెన్స్‌లో కొచ్చికి తరలించారు. కట్టప్పన నుంచి వచ్చిన అంబులెన్స్ చెరుతోని-తొడుపుజ-మువట్టుపుజ-వైటిళ్ల-ఎడప్రూట్ మీదుగా 129 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆసుపత్రికి చేరుకుంది. 

ఆన్ మరియా జాయ్‌  పరిస్ధితి గురించి జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ కార్యాలయం మీడియాకు సమాచారం అందించింది. అలాగే అంబులెన్స్ ప్రయాణించే మార్గంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఆటో రిక్షా డ్రైవర్లు, స్థానికులు రోడ్లను క్లియర్ చేసి అంబులెన్స్‌కు రూట్‌ను ఏర్పాటు చేశారు. కట్టప్పనా నుంచి కొచ్చికి సగటు ప్రయాణ సమయం 3 గంటల 56 నిమిషాలు. అందరి సహకారంతో ఈ దూరాన్ని అంబులెన్స్ చాలా త్వరగానే అధిగమించగలిగింది. ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఎర్నాకులంలోని ఎడపల్లిలోని అమృత ఆసుపత్రికి అంబులెన్స్ చేరుకుంది.

click me!