ముస్లిం మ‌త పెద్ద ఇమామ్ ఉమ‌ర్ అహ్మద్ ఇలియాసీని కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వత్.. ఎందుకంటే ?

By team teluguFirst Published Sep 22, 2022, 2:14 PM IST
Highlights

ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్  కలిశారు. ఓ మసీదులో ఆయనతో గంటకు పైగా సమావేశం అయ్యారు. 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీని కలిశారు. ముస్లిం కమ్యూనిటీకి చేరువయ్యే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో ఉన్న కస్తూర్బా గాంధీ మార్గ్ లో ఉన్న మసీదులో దాదాపు గంటకు పైగా త‌లుపులు వేసుకొని వారి మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది. మోహ‌న్ భ‌గ‌వ‌త్ వెంట సంఘ్ సీనియర్ కార్యకర్తలు కృష్ణ గోపాల్, రామ్ లాల్, ఇంద్రేష్ కుమార్‌లు ఉన్నారు.

ద‌మ్ముంటే ముంబై, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శివ‌సేన‌ను ఓడించండి - అమిత్ షాకు ఉద్ద‌వ్ ఠాక్రే స‌వాల్

ఆర్‌ఎస్‌ఎస్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. హిజాబ్ వివాదం, జ్ఞానవాపి, మతాల మధ్య శాంతి, సామరస్యాన్ని కాపాడటం వంటి అంశాలపై సమావేశంలో చర్చ‌లు జ‌రిగాయ‌ని ANI నివేదించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ గత కొన్ని రోజులుగా మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి, అంతర్గత సంబంధాలను మెరుగుపరచడానికి ముస్లిం మేధావులను కలుస్తున్నార‌ని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. ‘‘ ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తారు. ఇది నిరంతర సాధారణ ‘సంవాద్’ ప్రక్రియలో భాగం ’’ అని ఆయన తెలిపారు.

గవర్నర్ vs ప్రభుత్వం: బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు ఇలా.. ?

అయితే గత నెలలో కూడా భగవత్ ఐదుగురు ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న సామరస్య వాతావరణంపై చర్చించారు. కాగా.. మంగళవారం కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ భ‌గ‌వ‌త్.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురైషీ, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో పాటు అనేక మంది ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. అంతకు ముందు ఉదాసిన్ ఆశ్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జమీరుద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ, పరోపకారి సయీద్ షెర్వానీ కూడా ఉన్నారని వర్గాలు వార్తా సంస్థ ‘పీటీఐ‘కి తెలిపారు.

వివాహేతర సంబంధం... ప్రియుడిని కట్టర్ మెషీన్ తో నరికి చంపి, శరీర భాగాలను ఊరంతా చల్లి...

దేశ ప్రగతికి మత సామరస్యం, వర్గాల మధ్య సయోధ్యను బలోపేతం చేయడం చాలా అవసరమని సంఘ్ చీఫ్, మేధావులు అంగీకరించారని వర్గాలు పీటీఐకి వెల్లడించాయి. ‘‘ మత సామరస్యం, కమ్యూనిటీల మధ్య విభేదాలు, అపార్థాలను తొలగించాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు ప్రశంసించాయి. ఈ చొరవను కొనసాగించడానికి ఒక ప్లాన్ తయారయ్యింది ’’ అని వర్గాలు తెలిపాయి. కాగా.. మోహన్ భగవత్ 2021, 2019లో ఇలాంటి సమావేశాలకు హాజరయ్యారు.
 

click me!