ఆగిన బస్సులో నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే దిమ్మతిరిగే సీన్..

Published : Sep 22, 2022, 02:00 PM IST
ఆగిన బస్సులో నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే దిమ్మతిరిగే సీన్..

సారాంశం

బస్టాండ్‌లో ఆగిన బస్సు లగేజీ బాక్సులోంచి వింత శబ్దాలు మొదలయ్యాయి. అక్కడే ఉన్న డ్రైవర్ ఏం జరుగుతుందో చూసేందుకు వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బస్టాండ్‌లో ఓ బస్సు వచ్చి ఆగింది. ఆ తరువాత ఆ బస్సు లగేజీ బాక్సులోంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యింది. అక్కడే ఉన్న డ్రైవర్ కు మొదట ఏమీ అర్థం కాలేదు.. ఆ తరువాత బస్సులోంచే ఆ శబ్దాలు వస్తున్నాయని తెలుసుకుని ఏం జరుగుతుందో చూసేందుకు వెళ్లాడు. ఆ శబ్దాలకు భయపడుతూనే బస్సును చెక్ చేశాడు. బస్సు లగేజీ బాక్సులో ఓ భారీ కొండచిలువ  ఉంది. అది చూసి అందరూ షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సివిల్ లైన్స్ బస్టాండ్‌లో ఓ బస్సు ఆగి ఉంది. అందులోని లగేజీ బాక్సులోంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అది గమనించిన బస్సు డ్రైవర్  ఏం జరుగుతుందో చూసేందుకు ప్రయత్నించాడు. లగేజీ బాక్సును తనిఖీ చేయగా.., అక్కడ ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. దాని కదలికలవల్లే ఆ శబ్దాలని అర్థం అయ్యింది. వెంటనే ఎలాంటి ప్రమాదం జరగకుండా.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. 

ద‌మ్ముంటే ముంబై, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శివ‌సేన‌ను ఓడించండి - అమిత్ షాకు ఉద్ద‌వ్ ఠాక్రే స‌వాల్

విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నఅటవీశాఖ అధికారులు అతి కష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..