సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యేవారికి రూ. 7,500 స్టైపండ్ అందిస్తాం: మంత్రి ఉదయనిధి

By Mahesh KFirst Published Oct 14, 2023, 8:24 PM IST
Highlights

సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఆర్థిక సహకారం అందించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేయి మంది సివిల్ అభ్యర్థులకు పది నెలలపాటు నెలకు రూ. 7,500 చొప్పున స్టైపెండ్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.
 

చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం సంచలన ప్రకటన చేశారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారిని ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు వివరించారు. వారికి పది నెలల పాటు రూ. 7,500 చొప్పున అందించనున్నట్టు చెప్పారు. వేయి మందికి ఈ స్టైపండ్ అందిస్తామని తెలిపారు.

యూత్ వెల్ఫేర్, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), ఇండియన్ బ్యాంక్ సర్వీసెస్, రైల్వే ఉద్యోగాలు కొట్టాలి. ఆ ఉద్యోగాలు సాధించడం మన ద్రవిడయన్ మాడల్ లక్ష్యాల్లో ఒకటి. కరుణానిధి గ్రాడ్యుయెట్లు కావాలని కోరుకున్నారు. పెరియార్ అన్నా, కరుణానిధి యువత అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. మన సీఎం ఎంకే స్టాలిన్ కూడా అదే మార్గంలో నడుస్తున్నారు.’ ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

‘మన నాన్ ముధల్వాన్ స్కీం అద్భుతమైన పథకం. ఈ స్కీం కింద 13 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనాలు పొందారు. అందులో 1.5 లక్షల మంది యువత ఉద్యోగాలు సాధించారు. యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి. ఈ వైపుగా యువత కలలాను సాకారం చేయడానికి నాన్ ముధల్వాన్ స్కీం ఉపకరిస్తుంది’ అని ఉదయనిధి తెలిపారు.

Also Read: ఉదయమే వచ్చి ఓటేస్తే పోహా, జిలేబీ ఫ్రీ ఆఫర్.. ఎందుకంటే?

తమిళనాడులో ఇందుకోసం అనేక వసతులు ఉన్నాయని, కానీ, రాను రాను కేంద్రప్రభుత్వం ఉద్యోగాల్లో మన రాష్ట్ర వాసుల సంఖ్య తగ్గుతున్నదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ‘తమిళనాడులో అనేక వసతులు ఉన్నప్పటికీ యువత యూపీఎస్సీ పరీక్షలకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరు అవుతున్నారు. ఇది షాకింగ్‌గా ఉన్నది. 2016లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం తమిళ యువత ఉంటే.. ఇది ఇప్పుడు ఐదు శాతానికి తగ్గిపోయింది. అందుకే యూపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ కేంద్రాలు, ఆర్థిక సహకారం అందించాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో భాగంగా వేయి మంది విద్యార్థులకు పది నెలలపాటు నెలకు రూ. 7,500 చొప్పున అందిస్తాం’ అని ఉదయనిధి స్టాలిన్ వివరించారు.

click me!