ఉదయమే వచ్చి ఓటేస్తే పోహా, జిలేబీ ఫ్రీ ఆఫర్.. ఎందుకంటే?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఓటింగ్ శాతం పెంచాలని కొన్ని దుకాణాల సముదాయాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఉదయం 9 గంటల్లోపే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ఆఫర్ ప్రకటించాయి. 
 


ఇండోర్: ఉదయం తొమ్మిది గంటల్లోపు వచ్చి ఓటేస్తే వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందించాలని మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని ఫేమస్ ఫుడ్ హబ్ ‘56 దుకాణ్’ షాపుల యజమానులు నిర్ణయించారు. ఆ సమయం దాటి వచ్చిన వారికీ పది శాతం డిస్కౌంట్‌తో అందిస్తామని చెప్పారు. ఇదంతా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడానికే అని వారు చెప్పడం గమనార్హం. 

మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17వ తేదీన ఒకే విడతలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఇండోర్ నగరంలో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలని తాము సంకల్పించినట్టు దుకాణ యజమానులు చెప్పారు.

Latest Videos

56 దుకాన్ ట్రేడర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుంజన్ శర్మ మాట్లాడుతూ, దేశంలో పరిశుభ్ర నగరంలో ఇండోర్ టాప్ ప్లేస్‌లో ఉన్నదని వివరించారు. ఇదే విధంగా వోటింగ్‌లోనూ తమ నగరం ఫస్ట్ సిటీగా ఉండాలనేది తమ అభిలాష అని తెలిపారు. అందుకోసమే తొందరగా వచ్చి ఉదయమే ఓటు వేసే వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందించాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు.

Also Read: 41 ఏళ్ల తర్వాత తమిళనాడు నుంచి శ్రీలంకకు సముద్రయానం పున:ప్రారంభం

‘ఈ ఆఫర్ నవంబర్ 17వ తేదీన ఉదయం 9 గంటల వరకే ఉంటుంది. ఓటు వేసి వేలి మీదున్న ఇంక్ చుక్కను చూపించాల్సి ఉంటుంది. 9 గంటలు దాటితే ఆ తర్వాత రోజు మొత్తం వీటిపై పది శాతం డిస్కౌంట్ అందిస్తాం’ అని గుంజన్ శర్మ వివరించారు.

click me!