స్మగ్లర్ల తెలివి.. ఫైల్ ఫోల్డర్ల మధ్య హెరాయిన్‌, పట్టేసిన బెంగళూరు ఎయిర్‌పోర్ట్ అధికారులు

By Siva KodatiFirst Published Jan 26, 2022, 6:35 PM IST
Highlights

బెంగళూరు ఎయిర్‌పోర్టులో (bangalore airport) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్ట్ కార్గో‌లో 5.3 కోట్ల విలువ చేసే 754 గ్రాముల హెరాయిన్‌ను (heroin) పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు (customs) . దుబాయ్ నుండి బెంగుళూరు వచ్చిన ఓ పార్శిల్‌లో డ్రగ్స్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 

ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా, పోలీసులు ఎన్ని కఠినచర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. బంగారం (gold), డ్రగ్స్‌లను (drugs) దొడ్డిదారిన దేశంలోకి స్మగ్లింగ్ (smuggling) చేస్తున్నారు. దేశంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు ఇందుకు వేదికగా మారుతున్నాయి. తాజాగా బుధవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో (bangalore airport) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్ట్ కార్గో‌లో 5.3 కోట్ల విలువ చేసే 754 గ్రాముల హెరాయిన్‌ను (heroin) పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు (customs) .

దుబాయ్ నుండి బెంగుళూరు వచ్చిన ఓ పార్శిల్‌లో డ్రగ్స్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయంలో ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్‌ను ఫైల్ ఫోల్డర్ మధ్య భాగంలో దాచి ప్యాకింగ్ చేసి పార్శిల్ ద్వారా బెంగుళూరుకు పంపారు స్మగ్లర్లు. విశ్వసనీయ సమాచారం మేరకు కార్గోలో పార్శిల్స్‌పై నిఘా పెట్టారు కస్టమ్స్ అధికారులు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌తో ఉన్న పార్శిల్ తీసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు . ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రస్తుతం ఈ దందా వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చే పనిలో అధికారులు వున్నారు. 
 

click me!