ప్రిన్సిపల్ నిర్వాకం.. మధ్యాహ్నం భోజన పథకం నుంచి.. రూ.11కోట్లు స్వాహా....

By Bukka SumabalaFirst Published Aug 3, 2022, 7:15 AM IST
Highlights

ఎన్జీవో పేరుతో మిడ్ డే మీల్ నిధులను స్వాహా చేసిన ఓ ప్రిన్సిపల్ ను ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాశాఖ, బ్యాంకుల అధికారుల సహకారంతో రూ.11.46 కోట్లు స్వాహా చేశాడని పోలీసులు తెలిపారు. 

ఆగ్రా :చిన్నారు పొట్టకొట్టి పదకొండు కోట్లు స్వాహా చేశాడో స్కూల్ ప్రిన్సిపల్. పేద, నిరుపేద విద్యార్థులకు అందాల్సిన నిధులను నకిలీ ఎన్జీవో పేరుతో తన సంస్థకు మళ్లించుకున్నాడు. దీనికోసం తన శాఖ, బ్యాంకు అధికారులను మభ్యపెట్టి సాయం తీసుకున్నాడు. ఎట్టకేలకు అతని అవినీతిమీద ఆరోపణలు వెల్లువెత్తడంతో దర్యాప్తు చేయడం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో ఎన్జీవో కింద అతను స్వాహా చేసిన నిధుల వివరాలు పోలీసులనే షాక్ కు గురి చేశాయి.  

మధ్యాహ్న భోజనం పథకంలో రూ. 11.46 కోట్లు స్వాహా చేసిన ఆరోపణలపై ఫిరోజాబాద్‌లోని ప్రాథమిక విద్యా విభాగానికి చెందిన ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం ఇక్కడ తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు ఈ మేరకు ఓ నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశాడు. అయితే అది ఫేక్ ది అని తేలింది. ఈ ఎన్జీవో కోసం అన్ని నకిలీ దృవీకరణ పత్రాలనువాడాడు. విద్యాశాఖ, బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకారంతో మధ్యాహ్న భోజన పథకం నుంచి తన ఎన్జీవోకు రూ. 11.46 కోట్లు వచ్చేలా చేసుకున్నాడని ఆగ్రా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్) తెలిపారు. 

"ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ప్రాథమిక విద్యాశాఖ ఉపాధ్యాయుడు చంద్రకాంత్ శర్మపై అవినీతి కేసు నమోదైంది. అతను ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్ నివాసి. ఫిరోజాబాద్ జిల్లా తుండ్లలోని జాజుపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు." అని అలోక్ శర్మ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్) తెలిపారు. ఆగ్రాలోని విజిలెన్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రాథమిక విద్యాశాఖ, బ్యాంకులకు చెందిన మరికొంత మంది ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుడిపై జూలై 27న కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

GroundWater: విషపూరితమైన భూగర్భ జలాలు.. దేశంలో 80% జనాభాకు విషపు నీరే!.. షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన కేంద్రం

ఫిరోజాబాద్‌లోని షికోహాబాద్‌లో రిజిస్టర్ అయిన 'సరస్వత్ అవాసీయ శిక్షా సేవా సమితి' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చంద్రకాంత్ శర్మ ఈ డబ్బును స్వాహా చేశాడు. "ఈ సంస్థ 2007లో ఆగ్రాలోని ఫర్మ్స్, సొసైటీలు, చిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయబడింది. ఎన్జీవో రిజిస్టేషన్ కోసం నకిలీ రేషన్ కార్డులు,  ID కార్డులను ఉపయోగించాడు" అని అలోక్ శర్మ చెప్పారు.

ఎన్జీవో రిజిస్ట్రేషన్ సమయంలో ఈ ప్రిన్సిపల్ తన తండ్రిని ఎన్జీవో ప్రెసిడెంట్ గా, తల్లిని మేనేజర్ అండ్ సెక్రటరీగా, భార్యను కోశాధికారిగా పేర్కొన్నాడు. అంతేకాదు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా తన ఎన్జీవోలో పదవులను కూడా ఇచ్చాడు. ఆ తరువాత కొంత కాలానికి తన తల్లితో సహా కొంతమంది NGO సభ్యుల మరణించాడని.. ప్రకటించాడని పోలీసులు తెలిపారు.

click me!