AAP MP Raghav Chadha: 'గరీబ్ శోషన్ టాక్స్ '.. GST కి కొత్త నిర్వ‌చ‌నం చెప్పిన ఆప్ ఎంపీ 

By Rajesh KFirst Published Aug 3, 2022, 4:19 AM IST
Highlights

AAP MP Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా  మ‌రోసారి కేంద్ర‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. జిఎస్‌టి అంటే.. గరీబ్ శోషన్ టాక్స్ (పేదవాడిని దోపిడీ చేసే పన్ను) అని కొత్త నిర్వ‌చ‌నం చెప్పాడు.

AAP MP Raghav Chadha: ద్రవ్యోల్బణం పెరుగుద‌లపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (AAP MP Raghav Chadha) కేంద్ర‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. జిఎస్‌టి అంటే.. గరీబ్ శోషన్ టాక్స్ (పేదవాడిని దోపిడీ చేసే పన్ను) అని కొత్త అర్థం చెప్పాడు. స్వర్ణ దేవాలయంలోని సత్రాలపై జీఎస్టీ విధింపు అంశాన్ని కూడా ఎంపీ చాడ పార్లమెంట్‌లో లేవనెత్తారు. గోల్డెన్ టెంపుల్ సత్రాలపై బిజెపి జిఎస్‌టి విధించడం.. సిక్కులు, పంజాబీలపై ఔరంగజేబు జిజ్యా పన్ను లాంటిదని అభివర్ణించారు.

పార్లమెంటులో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గోల్డెన్ టెంపుల్ సత్రాలపై జిఎస్‌టి విధించినందుకు కేంద్ర ప్రభుత్వంపై చద్దా మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం సిక్కు, పంజాబ్ వ్యతిరేక వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  

ఇదే స‌మ‌యంలో  పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ.. చద్దా ఓ బాలీవుడ్ చిత్రంలో  'మహాగై దయాన్ ఖయే జాత్ హై' పాటను పాడాడు.  బీజేపీ పాలనలో ఇది నిజమైందన్నారు. దేశంలో నానాటికీ పెరుగుతున్న గృహ, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుల వెన్ను విరుస్తున్నాయ‌ని  విమ‌ర్శించారు.
 
రైతులు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు పెరుగుతున్న ద్రవ్యోల్బణం రెట్టింపు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏమీ చేయలేదని, కేంద్ర ప్రభుత్వం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పి ) పెంచుతామని హామీ ఇచ్చినా... ఏ ఒక్క పంట కూడా నెరవేర్చలేదనీ విమ‌ర్శించారు.

తత్ఫ‌ ఫలితంగా.., ఇప్పటికే అప్పులపాలైన రైతు మరింత అప్పుల పాలవుతున్నాడ‌నీ, అయినా ప్ర‌భుత్వం పాటించుకోవ‌డం లేద‌నీ, ప్రభుత్వం తన కార్పొరేట్ స్నేహితుల గురించి మాత్రమే ఆందోళన చెందుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బీజేపీ ప్రభుత్వ పేదల వ్యతిరేక విధానాలు, దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంద‌నీ అన్నారు. చరిత్రలో తొలిసారిగా పట్టణ ప్రాంతాల కంటే గ్రామాల్లోనే ద్రవ్యోల్బణం పెరగడం దిగ్భ్రాంతికర విషయమన్నారు. . గత ప్రభుత్వాలు రూపాయిని సీనియర్ సిటిజన్‌గా మార్చాయని, కానీ బిజెపి ప్రభుత్వం డాలర్‌తో రూపాయి విలువను 80-ప్లస్ దాటడం ద్వారా "గైడింగ్ బోర్డు"లో పెట్టిందని చాడా అన్నారు.

ద్రవ్యోల్బణాన్ని రావణుడితో పోల్చిన చద్దా.. రావణుడికి 10 తలలున్నట్లే దేశ ద్రవ్యోల్బణానికి 7 తలలు ఉన్నాయని అన్నారు. మొదటిది ఇంధ‌న పన్ను, రెండవది సేవా ద్రవ్యోల్బణం, మూడవది GST యొక్క భారం, నాల్గవది ఖర్చు-ద్రవ్యోల్బణం, ఐదవది పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న ఆదాయాలు, ఆరవది పడిపోతున్న రూపాయి, ఏడవది కార్పొరేట్, ప్రభుత్వ అనుబంధ సంస్థ‌లు అని వివ‌రించారు. 2016 నుంచి 2022 వరకు ఇంధనంపై ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.16 లక్షల కోట్లకు పైగా ఆర్జించిందని, గత ఏడాది కాలంలో ఇంధన ధరలు 75 రెట్లకు పైగా పెంచారని చెప్పారు.

click me!