రైల్వే రిటైర్డ్‌ అధికారిపై సీబీఐ దాడులు..17 కిలోల బంగారం, రూ.1.57 కోట్ల నగదును స్వాధీనం..  

By Rajesh KarampooriFirst Published Jan 18, 2023, 3:28 AM IST
Highlights

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భారతీయ రైల్వే రిటైర్డ్ అధికారిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఆయన ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వహించింది. సీబీఐ అధికారులు రూ. 1.57 కోట్ల నగదు, 17 కిలోల బంగారం, రూ. 2.5 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల బ్యాంక్ పత్రాలు, కోట్ల విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఒడిస్సాలోని భువనేశ్వర్‌లో రైల్వే రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌పై  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (CBI) కొరడా ఝూళిపించింది. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఏజెన్సీ జనవరి 3న కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో మంగళవారం రిటైర్డ్ అధికారి ఇంటి ఆవరణలో సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ దాడులలో  17 కిలోల బంగారం, రూ.1.57 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.

ప్రమోద్ కుమార్ జెనాపై సీబీఐ కేసు 

1989 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి అయిన ప్రమోద్ కుమార్ జెనాపై ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏజెన్సీ జనవరి 3న కేసు నమోదు చేసింది. ప్రమోద్ కుమార్ జెనా గతేడాది నవంబర్‌లో పదవీ విరమణ చేశారు.రిటైర్డ్ అధికారి తనకు తెలిసిన ఆదాయ వనరులకు పొంతన లేకుండా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

నగదు, 17 కిలోల బంగారం స్వాధీనం
  
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) భువనేశ్వర్‌లోని ప్రమోద్‌కుమార్ జెనాకు చెందిన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రమోద్‌కుమార్‌ జెనా ఇంటి నుంచి సీబీఐ 1.57 కోట్ల రూపాయల నగదు, 17 కిలోల బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. దీని ధర రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు బ్యాంకు, పోస్టల్ డిపాజిట్ రశీదులతో పాటు రూ.2.5 కోట్లు, పెద్దఎత్తున ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. "సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపించిన అసమాన ఆస్తులను కలిగి ఉన్నందుకు భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే, అప్పటి ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ (ఐఆర్‌టిఎస్)పై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో సోదాలు , లాకర్ ఆపరేషన్‌లు నిర్వహించింది" అని సిబిఐ ప్రకటనలో పేర్కొంది.

click me!